మిర్యాలగూడ : రైస్ మిల్లుల్లో విస్తృతంగా మొక్కలు నాటి కాలుష్యాన్ని నియంత్రించాలి..!
మిర్యాలగూడ : రైస్ మిల్లుల్లో విస్తృతంగా మొక్కలు నాటి కాలుష్యాన్ని నియంత్రించాలి..!
మిర్యాలగూడ, మన సాక్షి :
పర్యావరణ పరిరక్షణలో భాగంగా మిర్యాలగూడలోని రైస్ మిల్లులలో విస్తృతంగా వన మహోత్సవం నిర్వహించి మొక్కలు నాటాలని స్థానిక ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి అన్నారు.
మంగళవారం మిర్యాలగూడ నియోజకవర్గంలోని వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలో ఉన్న మహాతేజ రైస్ మిల్లులో మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో కాలుష్య నియంత్రణకు అడ్డుకట్ట వేసేందుకు లక్ష మొక్కలను నాటాలన్నారు.
రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 20 వేల మొక్కలు నాటేందుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు. ప్రతి రైస్ మిల్లులో 250 మొక్కలు నాటి కాలుష్య నియంత్రణకు కృషి చేయాలన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా కుల, మత, వర్గ, పార్టీ విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరు భాగస్వాములై మొక్కలు నాటాలన్నారు.
కాలుష్య రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్, మిర్యాలగూడ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకటరమణ చౌదరి, మహా తేజ రైస్ మిల్ అధినేత బండారు కుశలయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
BREAKING : నల్లగొండలో రూ.1.41 కోట్ల విలువైన గంజాయి దగ్దం..!
Miryalaguda : సాగర్ కాలువలు ఇలా.. నీరు పారేది ఎలా..!
ACB : ఏసీబీకి చిక్కిన అదనపు కలెక్టర్..!









