Miryalaguda : తప్పిపోయిన తహసిల్దార్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్.. సాగర్ కాలువలో మృతదేహం లభ్యం..!
Miryalaguda : తప్పిపోయిన తహసిల్దార్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్.. సాగర్ కాలువలో మృతదేహం లభ్యం..!
మిర్యాలగూడ, మన సాక్షి :
తప్పిపోయిన వ్యక్తి మృతదేహం నాగార్జునసాగర్ కాలువలో లభ్యమయింది. మిర్యాలగూడ వన్ టౌన్ ఎస్ఐ సైదిరెడ్డి తెలియజేసిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడలోని తహసిల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న నూనె ప్రవీణ్ కుమార్ (30) ఈనెల 29వ తేదీన తప్పిపోయాడు.
కాగా ఈ విషయాన్ని 29వ తేదీన అతని తండ్రి నూనె రాములు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. మృతుడు త్రిపురారం మండలం బ్రిజ్జికల్ గ్రామవాసి. తాసిల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు.
కాగా గురువారం మిర్యాలగూడ మండలం దొండవారిగూడెం సమీపంలో ఎన్ఎస్పి కాల్వలో మృతదేహం ఉన్నట్లుగా గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడు ప్రవీణ్ కుమార్ గా గుర్తించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
MOST READ :
-
Miryalaguda : రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. మొబైల్ ద్వారా నగదు రహిత రైల్వే టికెట్..!
-
Gold Price : మరోసారి షాక్.. పెరిగిన బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే..!
-
UPI : ఫిబ్రవరి 1 నుంచి ఆ యూపీఐ లావాదేవీల నిలిపివేత.. ఫోన్ పే, జి పే వినియోగదారులు తెలుసుకోవల్సిందే..!
-
Phone Pe : ఫోన్ పే, గూగుల్ పే యూజర్లు జాగ్రత్త.. ఆ ఫీచర్ ఆఫ్ చేయకుంటే మీ ఖాతా ఖాళీ.. అందరు తెలుసుకోవాల్సిందే..!









