MLA Jaiveer : నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే జైవీర్..!
MLA Jaiveer : నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే జైవీర్..!
మిర్యాలగూడ, మన సాక్షి:
నల్గొండ జిల్లా హాలియా మున్సిపాలిటీ ఆరో వార్డుకు చెందిన శీలం వెంకటయ్య గత 20 సంవత్సరాలుగా గణేష్ భవన్ హోటల్లో పని చేస్తూ జీవితం కొనసాగిస్తూన్నాడు.
ఇటీవల అనారోగ్య కారణంగా నిమ్స్ హాస్పటల్లో చేరడంతో విషయం తెలుసుకున్న స్థానిక కౌన్సిలర్ గౌని సుధారాణి రాజా రమేష్ యాదవ్ విషయాన్ని శాసనసభ్యులు కుందూరు జైవీర్ రెడ్డికి తెలియజేసి వారి కుటుంబ పరిస్థితుల గురించి వివరించారు. వారికి తక్షణ సాయం కింద 3 లక్షల రూపాయల పైచిలుకు ఎల్ఓసిని మంజూరు చేయించి వారి కుటుంబానికి ఎమ్మెల్యే జై వీర్ రెడ్డి అండగా నిలిచారు.
అంతేకాకుండా ప్రైవేట్ హాస్పిటల్ నందు చికిత్స కోసం బిల్లులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా 60 వేల రూపాయల చెక్కు అందజేశారు.అన్నివేళలా వెంకటయ్య కుటుంబానికి అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.సామాన్యుల పట్ల ఎమ్మెల్యే దాతృత్వంనీ అందరూ కూడా అభినందించడం అభినందించారు. నియోజవర్గ బడుగు బలహీన వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండి ఏ ఆపదొచ్చిన ఆదుకుంటానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గౌని రాజా రమేష్ యాదవ్, హాలియ మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ చింతల చంద్రారెడ్డి , సాగర్ మున్సిపాలిటీ కౌన్సిలర్ రామకృష్ణా, కాంగ్రెస్ నాయకులు పొదిల కృష్ణ ,మురళి కృష్ణ, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు ఎడవల్లి రంజిత్, సురభి హరిబాబు, కరెడ్ల నరసింహ, మహేష్ , శ్రీకాంత్, యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
MOST READ :









