ప్రధాని మోడీ సోదరుడు ధర్నా- latest news

 ప్రధాని మోడీ సోదరుడు ధర్నా- latest news

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగారు. అఖిల భారత చౌక ధరల దుకాణాల డీలర్ల సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్న ప్రహ్లద్ మోడీ తమ సంఘ డిమాండ్లను నెరవేర్చుకునేందుకు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవన వ్యయం పెరిగిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో రేషన్ దుకాణాలు నడపడం చాలా కష్టంగా మారిందన్నారు.

ASLO READ : ప్రభుత్వ పాఠశాలలో క్షుద్ర పూజల కలకలం 

రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసే బియ్యం, గోధుమలు, పంచదార పై కేంద్ర ప్రభుత్వం తమకిచ్చే కమిషన్ లో కేజీకి 20 పైసలు మాత్రమే పెంచడం హాస్యాస్పదమని విమర్శించారు. రేషన్ డీలర్లకు ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించేందుకు కేంద్రం సాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. బుధవారం తమ డీలర్ల సంఘ నాయకులంతా సమావేశమై భవిష్యత్ కార్యాచరణ పై చర్చిస్తామని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీని కూడా కలిసి వినతిపత్రం అందజేస్తామని ఆయన తెలియజేశారు. అదే విధంగా లోకసభ స్పీకర్ ఓంబిర్లను కూడా కలుస్తామని పేర్కొన్నారు.