తెలంగాణBreaking Newsజిల్లా వార్తలురాజకీయం

Nalgonda : దేశ సంపదను అదాని, అంబానీలకు దోచి పెడుతున్న మోడి సర్కార్‌..!

Nalgonda : దేశ సంపదను అదాని, అంబానీలకు దోచి పెడుతున్న మోడి సర్కార్‌..!

– అదాని వ్యవహారంపై నోరు మెదపని ప్రధాని మోడి

– ప్రజల సమస్యలను పరిష్కరించకుండా కాంగ్రెస్‌ విజయోత్సవాలు

– అమలులో లేని ఆరు గ్యారెంటీలు

– రైతు భరోసా, రుణమాఫీపై స్పష్టత లేదు

– సీపీఎం మహాసభలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

నల్గొండ:

కేంద్రంలోని మోడి సర్కార్‌ దేశ ప్రజల సంపదను అదాని, అంబానీలకు దోచి పెడుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మంగళవారం పట్టణంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహిస్తున్న సీపీఎం జిల్లా మహాసభలకు ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. సౌర విద్యుత్‌ ప్రాజెక్టు కోసం భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో
ప్రభుత్వ పెద్దలకు అదాని గ్రూప్‌ భారీగా ముడుపులు ముట్టజెప్పిందని అమెరికా కోర్టులో కేసు నమోదైందని అన్నారు. అదాని వ్యవహారం దేశానికి అప్రదిష్టంగా మారిందన్నారు.

దీనిపై ఇప్పటీకి ప్రధాని మోడి నోరు మెదపకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించకుండా విజయోత్సవాలు నిర్వహించడమేంటని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అనేక హామీలను ఇచ్చి వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందన్నారు. ఆరు గ్యారెంటీలను అమలు చేయడం లేదన్నారు. రైతు భరోసా, రైతు
రుణమాఫీఐ స్పష్టతలేదన్నారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్పా ఏ పథకాన్ని సరిగా అమలు చేయడం లేదన్నారు. హైడ్రా, మూసీ వంటి వాటిని తీసుకొచ్చి ప్రజల సమస్యలను
తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. హైడ్రాను తీసుకొచ్చి అక్రమంగా పేదల ఇండ్లను కూల్చడం సరైందికాదని, మూసీ నదిని ప్రక్షాళన చేయాల్సిందే కాని 15వేల పేదల ఇండ్లను కూలగొట్టకూడదన్నారు.

ముందే పేదలకు ఇండ్లనునిర్మించి ఆ తరువాత మూసీ ప్రక్షాళన చేయాలన్నారు. ఫార్మాసిటీ పేరుతో లగచర్లలో 8వేల ఎకరాలను గుంజుకుంటున్నారని, కలెక్టర్‌ను
నిలదీసిన ప్రజల ఇండ్లపై అర్థరాతి ఇండ్ల మీద పడి మహిళలను ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి మాటల్లోనే ప్రజాస్వామ్యం ఉందని, చేతల్లో నిర్భందకాండ ప్రయోగిస్తున్నారని అన్నారు.

లగచర్లలో తొండలు కూడా గుడ్లు పెట్టనవి సీఎం రేవంత్‌రెడ్డి అనడం సరైందికాదని, అక్కడ అన్ని పంటలు పండే భూములు ఉన్నాయని, పంటలు పండని భూములను ప్రభుత్వం తీసుకోవాలని 2013 చట్టం చెప్తుందని అన్నారు. సీపీఎం పోరాటంతోనే ఫార్మాసిటీ రద్దు అయిందని, భవిష్యత్తులో హామీల అమలు కోసం ప్రభుత్వ మెడలు
వంచుతామన్నారు. ఇలాంటి పోరాటాలకు మహాసభ రూపకల్పన చేస్తుందన్నారు.

కార్యక్రమంలో కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, మల్లు లక్ష్మీ, జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్య, డబ్బికార్‌ మల్లేష్‌,
సయ్యద్‌హాసం, కందాల ప్రమీల, ప్రభావతి, నాగార్జున, కూన్‌రెడ్డి నాగిరెడ్డి, బండా శ్రీశైలం,రవి నాయక్ జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు