జిల్లా వార్తలుBreaking Newsఉద్యోగంనాగర్ కర్నూల్ జిల్లా
MPDO : వెల్దండ నూతన ఎంపీడీఓ గా ఈసం కృష్ణయ్య బాధ్యతల స్వీకరణ..!
వెల్దండ మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) గా శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఊరుకొండ మండల కేంద్రంలో విధులు నిర్వహించిన ఈసం కృష్ణయ్య వెల్దండ మండలానికి బదిలీ అయ్యారు.

MPDO : వెల్దండ నూతన ఎంపీడీఓ గా ఈసం కృష్ణయ్య బాధ్యతల స్వీకరణ..!
వెల్దండ, మన సాక్షి:
నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) గా శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఊరుకొండ మండల కేంద్రంలో విధులు నిర్వహించిన ఈసం కృష్ణయ్య వెల్దండ మండలానికి బదిలీ అయ్యారు. ఇక్కడ ఎంపీడీవో గా విధులు నిర్వహించిన సత్యపాల్ రెడ్డి ఊరుకొండ మండలానికి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజలకు అందించే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు సత్వరమే చేరేలా కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా సర్పంచులు గన్యా నాయక్, మహిపాల్ నాయక్, రవీందర్, లక్ష్మీపతి, కేస్యా నాయక్ లు ఎంపీడీఓ ను ఘనంగా సన్మానించారు.










