Elections : పంచాయతీతో పాటే మునిసిపల్ ఎన్నికలు.. ముహూర్తం ఎప్పుడో తెలుసా..!

Elections : పంచాయతీతో పాటే మునిసిపల్ ఎన్నికలు.. ముహూర్తం ఎప్పుడో తెలుసా..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే గ్రామ పంచాయతీలలో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. గ్రామపంచాయతీలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కులగణన అనంతరం బీసీ రిజర్వేషన్ల ఖరారు తర్వాత వెంటనే గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం రెడీ అయ్యింది.
గ్రామాలలో సర్పంచ్ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికలను కూడా వెంట వెంటనే నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా వాటితో పాటే మున్సిపల్ ఎన్నికలు కూడా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. జనవరి 26 తో మున్సిపల్ పాలక మండలి గడువు ముగియనున్నది.
దాంతో పంచాయతీ ఎన్నికల తో పాటే మున్సిపల్ ఎన్నికలు కూడా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. సంక్రాంతి పండుగ తర్వాత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి ఫిబ్రవరిలో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది.
రెండు రోజుల్లో గెజిట్ :
రాష్ట్రంలో ఇప్పటికే 141 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లు ఉన్నాయి. ఇటీవల కొత్తగా 12 మున్సిపాలిటీలు రెండు కార్పొరేషన్లు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దానిపై రెండు రోజుల్లో గెజిట్ విడుదల అయ్యే అవకాశం ఉంది. అందులో 129 మున్సిపాలిటీల పదవీకాలం జనవరి 26 తో ముగియనున్నది. మరో ఏడు మున్సిపాలిటీలు కార్పొరేషన్ల గడువు మే వరకు ఉంది.
జిహెచ్ఎంసి పదవీకాలం ఫిబ్రవరి వరకు ఉన్నది. ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది జనవరిలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. గతంలో 138 మున్సిపాలిటీల గాను ఎన్నికలు జరిగాయి. కాగా గ్రామ పంచాయతీలతో పాటు మున్సిపల్ ఎన్నికలు కూడా ఫిబ్రవరి, మార్చి నెలలోనే నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
MOST READ :
-
Gold Price : కొత్త సంవత్సరంలో భారీ శుభవార్త.. రూ.4900 తగ్గిన బంగారం ధర..!
-
Ration Shops : రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ.. తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త..!
-
Ration card : రేషన్ కార్డులో మీ కుటుంబ సభ్యుల పేర్లు చేర్చాలా.. అయితే ఇలా చేయండి..!
-
Viral Video : న్యాయం కోసం స్టేషన్ కు వచ్చిన మహిళ.. గదిలోకి తీసుకెళ్లి పోలీసు అసభ్యకర ప్రవర్తన..!









