Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

CRIME NEWS : ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతికి భర్తే కాలయముడు.. ఏడు నెలల గర్భవతి అని కూడా చూడకుండా..!

CRIME NEWS : ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతికి భర్తే కాలయముడు.. ఏడు నెలల గర్భవతి అని కూడా చూడకుండా..!

గర్భిణీ హత్య కేసును ఛేదించిన పోలీసులు

మొఖంపై దిండు పెట్టి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు

మర్రిగూడ, మన సాక్షి:  ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతికి భర్తే కాలయముడవుతాడని ఊహించలేదు. ఏడు నెలల గర్భవతి అని కూడా చూడకుండా ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. ఈనెల 10వ తేదీన నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం అజిలాపురం గ్రామంలో జరిగిన ఏడు నెలల రెండు గర్భిణి హత్య కేసును పోలీసులు చేదించారు.

ఏడు నెలల గర్భిణీ అని కూడా చూడకుండా బాల సుస్మిత ను ఆమె భర్త శ్రీకాంత్ దిండు దిండుతో ముఖంపై ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అతను భార్యను హత్య చేసి సాధారణ మరణంగా చిత్రించే ప్రయత్నం చేశాడు. సుస్మిత తరపున బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది.

ALSO READ :

  1. సూర్యాపేట : రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడు మృతి..!

మర్రిగూడ ఎస్ఐ రంగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అజిలాపురం గ్రామంలో ఈనెల 10న హఠాత్తుగా మృతి నొందిన ఏడు నెలల నిండు గర్భిణి బాల సుస్మిత (20) మృతదేహంపై పీఎంఈ నిర్వహించిన వైద్యుని అభిప్రాయం మేరకు ఈరోజు అనగా 15 వ తేదీ శుక్రవారం నిందితుడు వడ్త్యా శ్రీకాంత ని  అరెస్టు చేసినట్లు మర్రిగూడ ఎస్ఐ కె రంగారెడ్డి తెలిపారు. “ఆస్ఫియాక్సా” (ఊపిరాడకుండా చేసి) కారణంగా మరణం సంభవించిందని పోస్టుమార్టం రిపోర్ట్ లో తేలినట్లు తెలిపారు.

తదుపరి నిందితుడు కూడా నిజం ఒప్పుకున్నట్లు తెల్పారు. ఈనెల 15న , 174 Cr.P.C నుండి 302 IPCకి కేసు మార్చబడినట్లు తెలిపారు. నిందితుడిని దేవరకొండ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరగా , రిమాండ్ నిమిత్తం జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు మర్రిగుడ ఎస్సై కే. రంగారెడ్డి తెలిపారు.

ALSO READ :

  1. Telangana : విద్యార్థులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్.. దసరా నుంచి అమలు..!

మరిన్ని వార్తలు