మాడ్గులపల్లి : దారుణ హత్య.. భార్యను హతమార్చిన భర్త..!

మిర్యాలగూడ (మాడ్గులపల్లి) మన సాక్షి : నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండలంలో దారుణ హత్య జరిగిన సంఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..

మాడ్గులపల్లి : దారుణ హత్య.. భార్యను హతమార్చిన భర్త..!

మిర్యాలగూడ (మాడ్గులపల్లి) మన సాక్షి :
నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండలంలో దారుణ హత్య జరిగిన సంఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..

మాడ్గులపల్లి మండలం ఆగా మోత్కూరు గ్రామానికి చెందిన నాగయ్య కు రమణ (35) తో 22 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఒక కుమార్తె , కుమారుడు కూడా ఉన్నారు. వీరు కొంతకాలంగా నల్గొండ మండలం జి అన్నారం లోని వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తున్నారు.

ALSO READ : కేటీఆర్ ఫోన్ కాల్ లీక్.. సోషల్ మీడియాలో షేర్ చేసిన కాంగ్రెస్..! (ఆడియో)

అక్కడే జీవనం కొనసాగిస్తున్నారు. కాగా రెండు , మూడు నెలల నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దాంతో భార్య రమణా కుమార్తెతో కలిసి అమ్మగారి ఊరైన తిప్పర్తి మండలం ఎల్లమ్మ గూడెం గ్రామం కు వెళ్ళిపోయింది. కాగా వారం రోజుల క్రితం భార్యాభర్తలు ఇద్దరు ఆగమొత్కూర్ గ్రామానికి వచ్చారు.

కాగా గురువారం రాత్రి భార్యాభర్తల నడుమ మరోసారి గొడవ జరిగింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న భర్త నాగయ్య భార్యపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి గొంతు కోశాడు. అనంతరం పరారయ్యాడు. ఇంట్లో రక్తపు మడుగులో పడి ఉన్న తల్లిని చూసి కుమార్తె , స్థానికులు ఆసుపత్రికి తరలించే లోగా అప్పటికే మృతి చెందింది.

ALSO READ : పారిపోయాడంటూ గజ్వేల్ సభలో సీఎం కేసీఆర్ పై రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని మాడులపల్లి ఎస్ఐ సురేష్ కుమార్ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.