Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Nalgonda : గుర్రంపోడులో రోడ్డెక్కిన అన్నదాత.. ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం.. బస్తాకు రెండు కిలోల కోతపై రైతుల ఆగ్రహం..!
నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండల కేంద్రంలో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు కన్నెర్రజేశారు.

Nalgonda : గుర్రంపోడులో రోడ్డెక్కిన అన్నదాత.. ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం.. బస్తాకు రెండు కిలోల కోతపై రైతుల ఆగ్రహం..!
గుర్రంపోడు, మన సాక్షి :
నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండల కేంద్రంలో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు కన్నెర్రజేశారు. ఐకేపీ సెంటర్లు తెరిచినా ఇప్పటివరకు గుర్రంపోడు మండల కేంద్రంలో ఒక్క గింజ కూడా కొనలేదని ఆరోపిస్తూ బుధవారం నల్లగొండ – దేవరకొండ రహదారిపై బైఠాయించారు. ఒకవైపు కొనుగోళ్లలో జాప్యం జరుగుతుంటే, మరోవైపు నిర్వాహకులు బస్తాకు రెండు కిలోల కోత విధిస్తామని చెప్పడంపై రైతులు మండిపడ్డారు.
దళారులు, మిల్లర్లు కుమ్మక్కై తమను దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.సంఘటనా స్థలానికి చేరుకున్న ఏఓ, ఎంఆర్ఓలను రైతులు నిలదీయగా వారు సమాధానం చెప్పలేక మౌనం వహించారు. తక్షణమే కొనుగోళ్లు ప్రారంభించి, అక్రమ కోతలను అరికట్టాలని అన్నదాతలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు,రైతులు పాల్గొన్నారు.









