Murder : మహిళ పై పెట్రోల్ పోసి నిప్పు పెట్టి దారుణ హత్య..!
Murder : మహిళ పై పెట్రోల్ పోసి నిప్పు పెట్టి దారుణ హత్య..!
రామసముద్రం, మనసాక్షి :
అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం ఎలకపల్లి లో మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. సి ఐ సత్యనారాయణ వివరాల మెరకు ఎలకపల్లె సమీపంలోని వ్యవసాయ పొలం గట్టున ఓ మహిళ 25 నుంచి 35 సంవత్సరాలు కలిగిఉంటాయి.
గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి పెట్రోల్ పోసి నిప్పు పెట్టినట్లు తెలిపారు.మృతి చెందిన మహిళ ఎవరు,ఎవరు చంపారు,ఇందుకు గల కారణాలను త్వరలోనే తెలుసుకుంటామని తెలిపారు.మృత దేహాన్ని శవ పరీక్షల నిమిత్తం పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సి ఐ సత్యనారాయణ తెలిపారు.
మదనపల్లె డి ఎస్ పి మహేంద్ర సంఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాన్ని పరిశీలించారు. సంఘటనా స్థలం కర్నాటకకు దగ్గరలో ఉండడంతో ఆంధ్ర సరిహద్దుల్లో కర్ణాటకలో ఉన్న పోలీస్టేషన్ లకు మృతి చెందిన మహిళ పోటోలను పంపి ,సమాచారం తెలుసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.
స్థానిక వి ఆర్ వో ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డి ఎస్ పి మహేంద్ర సీఐ సత్యనారాయణ, ఇంచార్జ్ ఎస్సై తిప్పేస్వామి తెలిపారు.కాలిపోయిన మృతి చెందిన మహిళ మృతదేహం వద్దకు సోమవారం చిత్తూరు డాగ్ స్క్వాడ్ బృందం చేరుకుంది డిఎస్పీ మహేంద్ర, సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో మహిళ మృతదేహం దగ్ధం అయిన చోటి నుంచి ఎలకపల్లె మీదుగా కమ్మ వారి పల్లె రోడ్డు వరకు వెళ్లాయి.
MOST READ :
-
Health Insurance : హైదరాబాద్‌లో ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన గెలాక్సీ హెల్త్ ఇన్సూరెన్స్..!
-
Free Bus : తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం పై సజ్జనార్ కీలక ప్రకటన..!
-
BOI: బ్యాంక్ ఆఫ్ ఇండియా అద్భుతమైన ఫలితాలు.. Q4FY25లో 82% నికర లాభ వృద్ధి..!
-
BOI: బ్యాంక్ ఆఫ్ ఇండియా అద్భుతమైన ఫలితాలు.. Q4FY25లో 82% నికర లాభ వృద్ధి..!









