క్రైంBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Nalgonda : నల్గొండ జిల్లాలో పట్ట పగలు దొంగల హల్ చల్.. వరుస చోరీలు..!

Nalgonda : నల్గొండ జిల్లాలో పట్ట పగలు దొంగల హల్ చల్.. వరుస చోరీలు..!

చింతపల్లి, మనసాక్షి :

నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో పట్టపగలు రెండు ఇళ్లకు తాళాలు వేసి ఉన్న ఇళ్లల్లో గుర్తుతెలియ వ్యక్తులు చోరీకి పాల్పడిన సంఘటన బుధవారం చో టుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చింతపల్లి గ్రామానికి చెందిన కుకుడాల వెంకన్న, పాల్వాయి నిరంజన్ లు వారి ఇళ్లకు తాళాలు వేసి పనులపై వెళ్లారు. పట్టపగలు తాళాలు వేసి ఉన్న ఇండ్లను గమనించిన గుర్తుతెలియని వ్యక్తులు 12:30 గంటల సమయంలో తాళాలు పగలగొట్టి ఇళ్లల్లోకి చొరబడ్డారు.

కుకుడాల వెంకన్న అత్త భారతమ్మ వారి ఇంటి వద్దకు వచ్చి చూడగా ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. ఆమెకు అనుమానం వచ్చి వెంకన్న, అతని భార్యకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి ఇంట్లో చూడగా కూడా వెంకన్న ఇంటి బీరువాలో ఉన్న 4 1/2 తులాల బంగారు ఆభరణాలు, కొంత నగదును దొంగిలించినట్లు బాధితులు పోలీసుల ముందు వాపోయారు.

అదేవిధంగా చింతపల్లి గ్రామానికి చెందిన పాల్వాయి నిరంజన్ ఇంట్లో కూడా దోపిడీ చేసేందుకు బీరువాను పగలగొట్టి వెతికారు. నిరంజన్ ఇంట్లో కొంత నగదు మాత్రమే పోయినట్లు పోలీసులు గుర్తించారు.

బాధితుడు కుక్కుడాల వెంకన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాంపల్లి సిఐ రాజు చింతపల్లి ఎస్ఐబి యాదయ్యలు చోరీకి పాల్పడ్డ ఇండ్లను పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

MOST READ : 

  1. Paddy : కర్ణాటక నుంచి అక్రమంగా ధాన్యం రవాణా.. చెక్ పోస్టుల వద్ద పటిష్ట బందోబస్తు..!

  2. NREGS : ఉపాధి హామీ సిబ్బందికి సర్కార్ గుడ్ న్యూస్..!

  3. Mango: కల్తీ మామిడిపండ్లను ఇలా గుర్తించాలి..!

  4. Rythu : రైతులకు భారీ గుడ్ న్యూస్.. ఈరోజు సాయంత్రం లోగా ఖాతాలలో నగదు జమ..!

  5. Anganwadi Workers : అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వం భారీ శుభవార్త..!

మరిన్ని వార్తలు