Breaking Newsక్రీడలుజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : నల్లగొండ జిల్లా జట్టు విజయం..!

Miryalaguda : నల్లగొండ జిల్లా జట్టు విజయం..!

మిర్యాలగూడ, మన సాక్షి:

ది తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరుగుతున్న సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్స్ వన్డే లీగ్ టోర్నమెంట్ లో భాగంగా నల్లగొండ జట్టు ఘనవిజయం సాధించింది.

నల్గొండ – అచ్చంపేట జట్ల మధ్య మంగళవారం నాడు మిర్యాలగూడ క్లియో స్పోర్ట్స్ నందు జరిగిన మ్యాచ్ లో నల్లగొండ జట్టు ఘనవిజయం సాధించిందని జిల్లా కోచ్ కావలి వెంకన్న తెలిపారు.

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన అచ్చంపేట జట్టు 13.2 ఓవర్లలో 61 పరుగులకే ఆలౌట్ కాగా 7.1 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా నల్లగొండ జట్టు లక్ష్యాన్ని ఛేదించింది.

టోర్నమెంట్ లో ఇంకా మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లా జట్ల తో మ్యాచ్ లు ఆడవలసి వుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ క్రీడాకారులు ముజాఫర్, సాయి కృష్ణ, శంకర్, రాజు, నాయుడు వున్నారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు