తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండవైద్యం

NALGONDA : డెంగ్యూ కేసుల పట్ల అనవసర భయాందోళనలు కలిగించవద్దు.. ప్రైవేట్ వైద్యులకు అదనపు జిల్లా కలెక్టర్..!

NALGONDA : డెంగ్యూ కేసుల పట్ల అనవసర భయాందోళనలు కలిగించవద్దు.. ప్రైవేట్ వైద్యులకు అదనపు జిల్లా కలెక్టర్..!

నల్లగొండ, మన సాక్షి,

ప్రైవేట్ ఆస్పత్రులు డెంగ్యూ కేసుల పట్ల ప్రజల్లో అనవసరమైన భయాందోళనలు కల్పించవద్దని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి. పూర్ణచంద్ర కోరారు .
శుక్రవారం అయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సీజనల్ వ్యాధులపై ఐ ఎం ఏ, ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యులతో సమావేశం నిర్వహించారు.ప్రజలు జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రులకు వైద్యం కోసం వచ్చినప్పుడు పరీక్షల అనంతరం నిర్ధారణ కాకుండా ఎట్టి పరిస్థితులలో జ్వరాలను డెంగ్యూగా ప్రకటించవద్దని కోరారు.

దీనివల్ల ప్రజలు అనవసరమైన భయాందోళనకు గురవుతారని, అందువల్ల డెంగ్యూ పాజిటివ్ కేసులు వచ్చినచోట తప్పనిసరిగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి లేదా డి సి హెచ్ ఎస్ ల తో నిర్ధారణ చేసుకున్న తర్వాతే డెంగ్యూ కేసులు గా ప్రకటించాలని చెప్పారు .అదే విధంగా ప్రైవేట్ ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చిన రోగులకు బిల్లుల విషయంలో మానవతా దృక్పథంతో చార్జీలు వసూలు చేయాలని అన్నారు.

క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం డాక్టర్లు ఎవరు వైద్యం చేస్తున్నది అలాగే తీసుకునే ఫీజు, ఆస్పత్రిలో కల్పిస్తున్న సౌకర్యాలు, తదితర అన్ని వివరాలు ఆస్పత్రికి వచ్చిన వారికి తెలిసే విధంగా ప్రదర్శించాలన్నారు. అలాగే ఆసుపత్రి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ను సైతం అందరికీ కనపడే విధంగా ఏర్పాటు చేయాలని, ప్రతి ఆసుపత్రిలో ఫైర్ సేఫ్టీ మెజర్స్ ను తప్పనిసరిగా చేపట్టాలన్నారు.

ప్రైవేట్ ఆస్పత్రులలో సాధారణ ప్రసవాలు పెంచాలని,, అనవసరంగా సిజేరియన్ వైపు వెళ్ళవద్దని కోరారు. జ్వరం కేసులకు సంబంధించి ప్రతిరోజు నివేదికను పంపించాలని ఆయన ఆదేశించారు. డెంగ్యూ నిర్ధారణ టెస్టు వచ్చిన తర్వాత మాత్రమే డెంగ్యూ కేసులు ప్రకటించాలని పునరుద్ఘాటించారు .ఈ విషయంలో ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు జిల్లా యంత్రాంగానికి పూర్తి సహకారం అందించాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఫోట్లు శ్రీనివాస్, ఐ ఎం ఏ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ అనితారాణి, డాక్టర్ పుల్లారావు ,గైనకాలజిస్ట్ డాక్టర్ సుచరిత, డాక్టర్ గౌరీ శ్రీ, అలాగే డాక్టర్ వసంత కుమారి, డాక్టర్ డి. శ్రీనివాస్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

ALSO READ : 

BREAKING MIRYALAGUDA : రేపు అన్ని ప్రైవేట్ ఆస్పత్రులలో ఓపి సేవలు బంద్.. ఎందుకంటే..!

Cm Revanth Reddy : మీకు రుణమాఫీ కాలేదా.. ఐతే రేవంత్ శుభవార్త..!

Rythu : రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో గుడ్ న్యూస్.. గాంధీ జయంతి నుంచి అమలు..!

మీకు జీరో కరెంటు బిల్లు రావట్లేదా.. అయితే వారికోసం ఓ గుడ్ న్యూస్..!

మరిన్ని వార్తలు