NALGONDA : నల్లగొండ వైద్య కళాశాల.. త్వరలో విద్యార్థులకు అందుబాటులోకి..!
NALGONDA : నల్లగొండ వైద్య కళాశాల.. త్వరలో విద్యార్థులకు అందుబాటులోకి..!
నల్లగొండ, మన సాక్షి :
నల్గొండ లో నూతన ప్రభుత్వ వైద్య కళాశాల భవనాన్ని ఆగస్టు చివరి నాటికి పూర్తిచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డితో ప్రారంభిస్తామని రాష్ట్ర రోడ్డు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన జిల్లా కేంద్రం సమీపంలోని ఎస్ఎల్బిసి కాలనీ వద్ద నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల పనులను జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డితో కలిసి తనిఖీ చేశారు.
అనంతరం మీడి యా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ ఆగస్టు చివరి నాటికి పనులను పూర్తిచేసి ప్రభుత్వ వైద్య కళాశాలను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురానట్లు తెలిపారు..
ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నిర్వహిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్థులు ప్రొఫెసర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీన్ని దృష్టిలో ఉంచుకొని గత ఆరునెలల నుండి వైద్య కళాశాల పనులను వేగవంతం చేశామని చెప్పారు..
ఉస్మానియా, గాంధీ, కాకతీయ తర్వాత ఎక్కువమంది రోగులు వస్తున్నది నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికే నని తెలిపారు.
ఈ వైద్య కళాశాల పూర్తయితే విద్యార్థులకు ఎంతో వీలుగా ఉంటుందన్నారు. ఇప్పటివరకే 95% పనులు పూర్తయ్యాయని, బాలికల వసతిగృహం సెప్టెంబర్ లో పూర్తవుతుందని, పనులలో నాణ్యత ఉండాలని ఆయన ఇంజనీరింగ్ అధికారులు కాంట్రాక్టర్ ను ఆదేశించారు.
రాష్ట్రంలోనే నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలను ఉత్తమ వైద్య కళాశాలగా, మోడల్ వైద్య కళాశాలగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. వైద్యం కోసం పేద ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల వైపు చూస్తున్నారని, ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి అప్పలపాలవుతున్నారని.
దీనిని దృష్టిలో ఉంచుకొని తమ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచాలని, నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆరోగ్యశ్రీ సైతం అమలు చేస్తామని అన్ని వసతులు కల్పిస్తామని ముఖ్యంగా సిబ్బందికి ట్రాన్స్పోర్ట్ కోసం రెండు ఏసీ బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు..
తాగునీరు, సివిల్ పనులు, విద్యుత్తు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తామన్నారు..
నర్సింగ్ కళాశాలకు 20 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని, నర్సింగ్ కళాశాలను సైతం ఇదే క్యాంపస్ లో నిర్మించనున్నట్లు మంత్రి వెల్లడించారు..
జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి,ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి
NALGONDA : మా ప్రభుత్వానికి ఇదే నిదర్శనం.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..!
Srishailam : శ్రీశైలంలో 859 అడుగులకు చేరిన నీటిమట్టం.. కొనసాగుతున్న వరద.. LATEST UPDATE









