NALGONDA : ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక అమలులో నల్గొండ జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంచాలి..!
నల్గొండ జిల్లా కేంద్రంలోని ఉదయాదిత్య భవన్లో ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక పై శనివారం నిర్వహించిన ఉమ్మడి నల్గొండ జిల్లా సన్నాహక సమావేశంలో నల్లగొండ జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్డలూరు లక్ష్మణ్ రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ రకాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయడంతో పాటు, గ్రామాలలో ఉన్న సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు కృషి చేయాలని చెప్పారు.

NALGONDA : ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక అమలులో నల్గొండ జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంచాలి..!
-
నల్గొండ జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర ఎస్సీ ,ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్,
-
రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
నల్లగొండ, మన సాక్షి.
నల్గొండ జిల్లా కేంద్రంలోని ఉదయాదిత్య భవన్లో ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక పై శనివారం నిర్వహించిన ఉమ్మడి నల్గొండ జిల్లా సన్నాహక సమావేశంలో నల్లగొండ జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్డలూరు లక్ష్మణ్ రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ రకాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయడంతో పాటు, గ్రామాలలో ఉన్న సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు కృషి చేయాలని చెప్పారు.
లబ్ధిదారులకు పథకాలు అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక పేరుమీద ముఖ్యమైన 10 అంశాల వారిగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నదని ,పరిసరాల పరిశుభ్రత, పెండింగ్ ఫైల్ పరిష్కారంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా పెండింగ్ ఫైల్లను సైతం పరిష్కరించాలన్నారు.
ALSO READ : Good News : నిరుద్యోగులకు శుభవార్త.. ఆ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..!
రైతులకు సంబంధించిన అంశాలు, సంక్షేమ కార్యక్రమాలు, మహిళలు, చిన్నపిల్లల భద్రత, రోడ్డు ప్రమాదాలు తదిత అంశాలపై ప్రజలకు స్పష్టంగా అవగాహన కల్పించాలని చెప్పారు. ప్రతినిత్యం జరిగే రోడ్డు ప్రమాదాలలో అనేక మంది చనిపోతున్నారని, అలా జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా అవగాహన కల్పించాలని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల కు సంబంధించి పెండింగ్లో ఉన్న బిల్లులన్నిటిని సోమవారం లోపు రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ చేయనుందని మంత్రి వెల్లడించారు. ఏప్రిల్ నుండి మరో విడత ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
వ్యవసాయంలో భాగంగా సోలార్ విద్యుత్ వినియోగించుకోవాలని, ప్రతిక్ ఫౌండేషన్ ద్వారా ఐటిపాముల గ్రామంలో 50 మంది స్వయం సహాయక మహిళా సంఘ లబ్ధిదారులకు 50 లక్షల రూపాయలను ఇచ్చి వారికి స్వయం ఉపాధి కల్పిస్తున్నామని చెప్పారు . 2028 జూన్ నాటికి ఎస్ఎల్ బిసీ ద్వారా సాగునీటి అందిస్తామని, డిండి ఎత్తిపోతల పథకం ద్వారా మునుగోడు, దేవరకొండ నియోజక వర్గాలకు సాగునీరు అందించే ప్రధాన కాలువల ఎత్తు 436 స్థాయి ఉండేలా చర్యలు తీసుకుంటామని, మూసిని ప్రక్షాళన చేసి తీరుతామని, జిల్లా కలెక్టర్లు నెలలో 15 రోజులు క్షేత్ర స్థాయిలో ఉండాలని, నిరంతరంతనిఖీలు , పర్యవేక్షణ చేస్తూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందేలా చూడాలని, రాష్ట్రప్రభుత్వం ప్రత్యేకంగా చేపట్టిన ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో గ్రామాలలో పారిశుధ్యం, తాగునీరు, ఇతర కార్యక్రమాలను సవ్యంగా అమలు చేసేలా చూడాలని, పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలను సందర్శించాలని చెప్పారు .
ఇప్పటివరకు గ్రామాలు ,మున్సిపాలిటీలలో ప్రజాప్రతినిధులు లేని కారణంగా అనేక సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారానికి కృషి చేయాలని, మహిళలు, పిల్లలు ,బాలికలసమస్యలను పరిష్కరించాలని తెలిపారు. తమ ప్రభుత్వం ప్రజల కోసం అంకితమై పనిచేస్తుందని, ఎల్లప్పుడూ తాము ప్రజలకు అందుబాటులో ఉంటామని, ఏ సమస్య వచ్చినా గ్రామసభల ద్వారా తమదృష్టికి తీసుకురావాలని,తాము ప్రజలకు అండగా నిలుస్తామని మంత్రి వెల్లడించారు.
జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర ఎస్ సి,ఎస్టీ సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలాన్ని ప్రజలకు చేరాల్సిన అవసరం ఉందని, అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో పథకాలను పేద ప్రజలకు అందేలా చూడాలని, ప్రభుత్వ ఆదేశాలను ఎవరు ఉల్లంఘించవద్దని, ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక అమలుపట్ల నిర్లక్ష్యం వహించవద్దని, ప్రభుత్వం పేద ప్రజల కోసం రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఉచిత విద్యుత్తు, రైతుబంధు, రైతు బీమా, రైతు భరోసా వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నదని, ఇవన్నీ కూడా ప్రజల వద్దకు నేరుగా వెళ్లేలా కార్యక్రమాలు రూపొందించడం జరిగిందని తెలిపారు.
ALSO READ : TG : తెలంగాణలో ఆ రైతులకు శుభవార్త.. ఎకౌంట్లోకి డబ్బులు, చెక్ చేసుకోండి..!
ఆయా షెడ్యూల్ తేదీలవారీగా కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, అధికారులు అందరూ బాధ్యతతో పనిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని, ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రత్యేక వాట్సాప్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని, కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు అధికారులందరూ సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని, అలాగే జిల్లా కలెక్టర్లు సైతం కార్యక్రమాన్ని ప్రతిరోజు పర్యవేక్షణ చేయాలని, ఏ రోజు చేసిన కార్యక్రమాలు ఆ రోజు నివేదిక రూపంలో రూపొందించాలని చెప్పారు.
రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక అమలులో భాగంగా మొదటి అంశమైన పరిశుభ్రత లో భాగంగా గ్రామపంచాయతీలకు గతంలో ఇచ్చిన ట్రాక్టర్లన్నీ సద్వినియోగం అయ్యేలా వినియోగంలోకి తీసుకురావాలని, రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సమస్య రాకుండా జిల్లా కలెక్టర్లు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ,పాఠశాలల్లో విద్యార్థులు , టీచర్ల సంఖ్య క్రమబద్ధీకరించాలనిజ్ రైతులకు యూరియా సమస్య లేకుండా సక్రమంగా యూరియా అందేలా చూడాలని, సోలార్ విద్యుత్ పై ప్రజలు, రైతులను చైతన్యం చేయాలని, వేసవిలో విద్యుత్ కొరత రాకుండా సోలార్ విద్యుత్ఉ పయోగపడుతుందని, అధికారులు, ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో పనిచేస్తే ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో సరైన ఫలితాలను రావడంతో పాటు ,ప్రజల నుండి మంచి ఆదరణ వస్తుందని తెలిపారు.
ALSO READ : Miryalaguda : మిర్యాలగూడలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. అయిదుగురు అరెస్ట్..!
ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు ,అధికారుల సమన్వయంతోనే ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికకార్యక్రమం విజయవంతమవుతుందని, ప్రతి గ్రామంలో ప్రభుత్వం అమలు చేయనున్న పది అంశాలు ప్రజల వద్దకు తీసుకు వెళ్లేలా చూడాలని, ప్రభుత్వ పథకాలన్నీ పేదలకుఅందేలా చూడాలని ,గ్రామాలలో లో వోల్టేజ్ సమస్య ,తాగునీటి సమస్య రాకుండా చూడాలని, ఇందిరమ్మ ఇళ్లలో ఎల్ వన్, ఎల్ టు, సమస్యలను పరిష్కరించాలని ,మిషన్ భగీరథ కింద అధికారులు ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకుని తాగునీటి సమస్య లేకుండా చూడాలని, ఎమ్మెల్సీ నెల్లికంట సత్యం, శంకర్ నాయక్ నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం, దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్, తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు, భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి నల్గొండ మేయర్ చైతన్య బుర్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు.
సమావేశం ప్రారంభమైన వెంటనే నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మార్చి 6 నుండి, జూన్ 12 వరకు ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని అమలు చేసేందుకు ఆదేశించడం జరిగిందని ,ఇందులో భాగంగా 5 స్థాయిలలో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్రస్థాయిలో కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. అంతేకాకుండా 10 ప్రధాన అంశాలపై కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, నల్గొండ ఎస్ పి శరత్చంద్ర పవార్ లు మాట్లాడారు .ఈ సమావేశానికి నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జైవీర్ రెడ్డి, నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాలో అదనపు కలెక్టర్లు, అన్ని జిల్లాల అధికారులు, తదితరులు హాజరయ్యారు. అనంతరం జిల్లా కలెక్టర్ సమావేశానికి హాజరైన వారందరి చేత ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పై ప్రతిజ్ఞ చేయించారు.










