నల్గొండ : నిరుద్యోగులకు శుభవార్త.. నల్గొండ యువతరం యాప్ తో ఇంటి వద్దనే శిక్షణ..!

నల్గొండ : నిరుద్యోగులకు శుభవార్త.. నల్గొండ యువతరం యాప్ తో ఇంటి వద్దనే శిక్షణ..!

నల్గొండ, మనసాక్షి :

ఉమ్మడి నల్గొండ జిల్లాలో యువతకు, విద్యార్థులకు అండగా ఉంటానని గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి స్పష్టం చేశారు. కాంపిటేటివ్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల కోసం ‘నల్గొండ యువతరం’ యాప్ ను మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ చాన్సులర్ సీహెచ్. గోపాల్ రెడ్డి చేతుల మీదుగా లాంచ్ చేశారు.

 

గూగుల్ ప్లే స్టోర్ లో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకుంటే.. నయా పైసా ఖర్చు లేకుండా, ఇంట్లోనే ఉంటూ ఏడాదిపాటు ఉచితంగా ఆన్ లైన్ లో క్లాసులు వినొచ్చన్నారు.

 

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా ప్రతి సంవత్సరం లక్షా 40వేల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు పడుతున్నాయని, ఈ యాప్ ను సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు.

 

కోచింగ్ కు వెళ్లలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న గ్రామీణ విద్యార్థుల కోసం నల్గొండ యువతరం యాప్ తీసుకొచ్చిన అమిత్ రెడ్డిని ఎంజీ వర్సిటీ వీసీ గోపాల్ రెడ్డి అభినందించారు. తమ కాలంలో ఇలాంటి టెక్నాలజీ లేదని ఈ అవకాశాన్ని ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఉపయోగించుకోవాలన్నారు.

నల్గొండ యువతరం యాప్ లో 57 రకాల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పోటీ పరీక్షలతో పాటుగా రాష్ట్ర స్థాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ఉపయోగపడే వీడియో క్లాసులు ఉంటాయని యాప్ రూపకర్త చక్రవర్తి చెప్పారు.

ఇంగ్లీష్ మరియు తెలుగు భాషల్లో ఆన్ లైన్ క్లాసులు అందుబాటులో ఉంటాయన్నారు. నల్గొండ యువతరం యాప్ లాంచింగ్ కార్యక్రమంలో టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు శ్రవణ్ కుమార్ ,ఆర్య వైశ్యులు సంఘం జిల్లా అధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు, యమా దయాకర్, అయితగాని స్వామి గౌడ్, మైనారిటీ లీడర్ బషిరుద్దిన్, కంచర కుంట్ల గోపాల్ రెడ్డి, హరి కృష్ణ, ఫ్యాకల్టీ శ్రీనివాస్ , చక్రవర్తి తోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు నిరుద్యోగులు భారీగా తరలివచ్చారు.