BREAKING : నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తిరుమలకు వెళ్లి వస్తుండగా హైదరాబాదు వాసులు ఐదుగురు మృతి..!

ఆంధ్ర ప్రదేశ్ లోని నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం బుధవారం తెల్లవారుజామున సంభవించింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన ఐదుగురు దుర్మరణం చెందారు.

BREAKING : నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తిరుమలకు వెళ్లి వస్తుండగా హైదరాబాదు వాసులు ఐదుగురు మృతి..!

మన సాక్షి , అమరావతి :

ఆంధ్ర ప్రదేశ్ లోని నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం బుధవారం తెల్లవారుజామున సంభవించింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన ఐదుగురు దుర్మరణం చెందారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన వారు మరణించినట్లుగా గుర్తించినట్లు తెలిపారు.

అయితే డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటం వల్లనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృతులంతా హైదరాబాదు నుంచి వచ్చిన వారని మాత్రమే తెలిసిందని, ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను పోస్టుమార్టం కోసం స్థానిక ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకున్నారు. దర్యప్తు చేస్తున్నారు.

ALSO READ : Miryalaguda : మిర్యాలగూడ రూరల్ ఎస్సైపై విచారణ.. బదిలీ వేటు..!