నారాయణఖేడ్ మున్సిపల్ కాంగ్రెస్ హస్తగతం…!

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో మునిసిపల్ చైర్ పర్సన్ రూబీన బేగం, వైస్ చైర్మన్ అహిర్ పరుశురాం లపై శుక్రవారం ఉదయం 11 గంటలకు ఎన్నికల అధికారి ఆర్డీవో నలువాల వెంకటేష్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు.

నారాయణఖేడ్ మున్సిపల్ కాంగ్రెస్ హస్తగతం…!

నెగ్గిన కాంగ్రెస్ అవిశ్వాసం:

కంగ్టి, మన సాక్షి :-

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో మునిసిపల్ చైర్ పర్సన్ రూబీన బేగం, వైస్ చైర్మన్ అహిర్ పరుశురాం లపై శుక్రవారం ఉదయం 11 గంటలకు ఎన్నికల అధికారి ఆర్డీవో నలువాల వెంకటేష్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అవిశ్వాసానికి 2/3 మెంబర్ల ఓటింగ్ అవసరం ఉంది. ఈ మేరకు 12 మంది కోటింగ్లో పాల్గొనాల్సి ఉండగా 13 మంది ఓటింగ్లో పాల్గొన్నారు.

చేతులెత్తిన కౌన్సిలర్లు
చేతులెత్తిన కౌన్సిలర్లు

కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస పరీక్ష నెగ్గడం జరిగింది. ఈ సందర్భంగా 15 మంది కౌన్సిలర్లు ముగ్గురు ఎక్స్ అఫీషియో మెంబర్లు మొత్తం 18 మంది ఓటర్లు ఉండగా 11 మంది కౌన్సిలర్లు ఇద్దరు ఎక్స్ ఆఫిషియో మెంబర్లు నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లు కలిసి 13 ఓట్లు అవిశ్వాస పరీక్షకు మద్దతుగా నిలిచారు. మిగతా ఐదు మంది ఓటింగ్ కు దూరంగా నిలిచారు

ALSO READ : Gas Cylinder : రూ.500లకే గ్యాస్ సిలిండర్.. ఎప్పటి నుంచి అంటే..!

దీంతో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన అవిశ్వాసం నెగ్గింది. తదుపరి కలెక్టర్ ఆదేశాల మేరకు నూతన చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల ఎన్నికకు చర్యలు తీసుకోనున్నట్లు ఎన్నికల అధికారి ఆర్డీవో నలువాల వెంకటేష్ వెల్లడించారు. ఈ మేరకు మున్సిపల్ కార్యాలయం వద్ద డిఎస్పి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియలో మున్సిపల్ కమిషనర్ గోపు మల్లారెడ్డి పాల్గొన్నారు.