Breaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లారాజకీయం

Narayanpet : పేట మున్సిపల్ చైర్ పర్సన్ బిజెపి కైవసం..!

సాధారణ రెండవ మున్సిపల్ 2026 ఎన్నికల్లో నాలుగవ వార్డు నుండి బిజెపి అభ్యర్థిగా విజయం సాధించిన కొండ శ్వేత సత్యయాదవ్ నారాయణపేట మున్సిపల్ చైర్పర్సన్ గా ప్రమాణ స్వీకారం చేశారు.

Narayanpet : పేట మున్సిపల్ చైర్ పర్సన్ బిజెపి కైవసం..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

సాధారణ రెండవ మున్సిపల్ 2026 ఎన్నికల్లో నాలుగవ వార్డు నుండి బిజెపి అభ్యర్థిగా విజయం సాధించిన కొండ శ్వేత సత్యయాదవ్ నారాయణపేట మున్సిపల్ చైర్పర్సన్ గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆర్డీవో రామచంద్రరావు ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే 6 వ వార్డు నుండి గెలుపొందిన మంజుల రాఘవేంద్రారెడ్డి వైస్ చైర్పర్సన్ గా బాధ్యతలు చేపట్టారు.

సోమవారం మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నికల ఆర్డీవో నిర్వహించారు. కాంగ్రెస్ నుండి శ్వేతా గౌడ్ కు 11 అభ్యర్థులు మద్దతు తెలిపారు. కాంగ్రెస్ నుండి 07గురు, ఎంఐఎం 02, ఫార్వర్డ్ బ్లాక్ నుండి ఒకరు కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు తెలిపారు. ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి ఎక్స్ అఫీషియ ఓటు వినియోగించుకున్నారు.

చైర్పర్సన్ స్థానానికి 13 మ్యాజిక్ ఫిగర్ గా ఉంది. కాంగ్రెస్ 11 మంది సంఖ్యాబలం అయింది. బి ఆర్ ఎస్ కు చెందిన ఇద్దరు అభ్యర్థులు ఈ చైర్ పర్సన్ ఎన్నికలో గైర్హాజరయ్యారు.బిజెపి నుండి 11 అభ్యర్థులు గెలుపొందగా స్వతంత్ర అభ్యర్థి ఇటీవల బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బిజెపి బలం 12కు చేరుకుంది. ఎంపీ డీకే అరుణ తన ఎక్స్ అఫీషియో ఓటును వినియోగించుకున్నారు. 2014 తర్వాత మళ్లీ ఇప్పుడు బిజెపి పార్టీ అభ్యర్థి చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు.

ALSO READ 

  1. Kamareddy : కామారెడ్డిలో బిగ్ ట్విస్ట్.. ఒక్కటైన కాంగ్రెస్, బీఆర్ఎస్..!

  2. Nalgonda : ఉమ్మడి నల్గొండ జిల్లాలో మేయర్, మున్సిపల్ చైర్మన్లు ఖరారు.. ఎవరెవరు ఎక్కడ..!

  3. తొర్రూరులో హై టెన్షన్..!

మరిన్ని వార్తలు