Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Award : ప్రముఖ బుర్రకథ కళాకారునికి జాతీయ నంది అవార్డు..!

Award : ప్రముఖ బుర్రకథ కళాకారునికి జాతీయ నంది అవార్డు..!

చింతపల్లి, మన సాక్షి:

గత 50 సంవత్సరాల సుదీర్ఘ విశిష్ట పౌరాణిక, చారిత్రాత్మక, పోరాట జీవిత చరిత్రల ను ఉనికి పుచ్చుకొని నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బుర్రకథ రూపంలో వివిధ వేదికలపై నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన బహుముఖ ప్రజ్ఞాశాలి బుర్రకథ కళాకారుడు బాణాల రంగాచారి ప్రదర్శించిన కలను గుర్తించి వారికి జాతీయ నంది అవార్డును తెలుగు వెలుగు సాహితీ వేదిక వారు మండలి వెంకట కృష్ణారావు శతజయంతోత్సవాల సందర్భంగా 20 25 – 2026 కు ఎంపిక చేయడం జరిగింది.

అందులో భాగంగా గురువారం హైదరాబాదులోని చిక్కడపల్లి హైదరాబాద్ లోని త్యాగరాయగానసభ, కళా వెంకట దీక్షితులు, కళా వేదిక ఆవరణలో జాతీయ స్వచ్ఛంద సంస్థ తెలుగు వెలుగు సాహితీ వేదిక ఆధ్వర్యంలో ప్రముఖ బుర్రకథ కళాకారుడైన బాణాల రంగాచారికి సరస్వతీ మాత ఉపాసకులు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ దైవజ్ఞశర్మ జాతీయ నంది ఉత్తమ అవార్డును అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దైవసంకల్పంతోనే కళారూపాలు అందిపుచ్చుకొని ప్రదర్శించ బడతారని వారన్నారు. ఈ సృష్టిలో కలలు కనే వారు కొందరు ఉంటే, ప్రదర్శించేవారు కొందరు ఉంటారని, అది దైవసంకల్పితమే తప్ప, మానవ సంకల్పితం కాదన్నారు. 64 కలలలో బుర్రకథ కూడా ఒక దైవ సంకల్పితమే అన్నారు.

నంది అవార్డు గ్రహీత బాణాల రంగాచారి ( గొల్లపల్లి మాజీ సర్పంచ్) ఈ అవార్డు పొందడం ఎంతో హర్షించదగ్గ విషయం అన్నారు. మరుగున పడిపోతున్న ఇలాంటి ఎంతోమంది కళాకారులను తెలుగు వెలుగు సాహితి వేదిక మరింత ముందుకు వెళ్లి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి గుర్తింపు తెస్తామన్నారు.

బాణాల రంగాచారి జాతీయ నంది అవార్డు పొందడం పట్ల వారికి తెలుగు వెలుగు సాహితీ వేదిక తరపున ప్రత్యేక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు వంగాల శాంతికృష్ణ ఆచార్యులు, కార్యనిర్వాకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడలు మండలి లక్ష్మణ్ బాయ్, జాతీయ యువత అధ్యక్షులు అద్దంకి నాగరాజు,

తెలంగాణ మాజీ బీసీ కమిషన్ చైర్మన్ వకులాభారం కృష్ణమోహన్రావు, మాజీ మేయర్ బండ కార్తికేయ రెడ్డి ప్రముఖులు ఏ కిరణ్ కుమార్, విశ్వ కళా రత్న పోలజ్ రోజ్ కుమారాచార్యులు, మాసాని కృష్ణారెడ్డి, వివిధ రంగాల కళాకారులు ప్రముఖులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

MOST READ : 

  1. Gold Price : బంగారం ధర తగ్గుతుందా.. ఈరోజు తులం ఎంతంటే..!

  2. Volleyball : వాలీబాల్ రాష్ట్రస్థాయి పోటీలకి జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థిని ఎంపిక..!

  3. District collector : ధాన్యం సేకరణ పై కంట్రోల్ రూమ్ ఏర్పాటు.. ఫిర్యాదులకు ఫోన్ నెంబర్..!

  4. Suryapet : మహిళలకు భారీ శుభవార్త.. ఉచితంగా మగ్గం వర్క్స్ శిక్షణ..!

మరిన్ని వార్తలు