Nalgonda : ఎక్సైజ్ అధికారులపై నాటు సారా తయారీ దారుల దాడి.. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు..!

Nalgonda : ఎక్సైజ్ అధికారులపై నాటు సారా తయారీ దారుల దాడి.. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు..!
దేవరకొండ, మనసాక్షి :
నల్లగొండ జిల్లా చందంపేట మండలం గువ్వలగుట్ట గ్రామంలో నాటుసారా తయారీకి నల్లబెల్లం సరపరా అవుతుందనే పక్క సమాచారం మేరకు గువ్వలగుట్ట గ్రామంలో తనిఖీలు నిర్వహిస్తున్న జిల్లా టాస్క్ ఫోర్స్ నల్లగొండ టీమ్ మంగళవారం దాడులు నిర్వహించారు.
దాడుల్లో డిస్టిక్ టాస్క్ ఫోర్స్ టీమ్ కు చెందిన ఎస్సై ఎం. హారిక తమ విధులు నిర్వహిస్తున్న క్రమంలో అదే గ్రామానికి చెందిన రామావత్ హనుమా మహిళా అధికారిని దుర్భాషలాడడమే కాకుండా దాడి చేయడం జరిగింది.
దాడిని నిలువరించడానికి వెళ్లిన దేవరకొండ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్( ఎస్ హెచ్ ఓ) సిబ్బందిని, డిటిఎఫ్ నల్లగొండ సిబ్బందిని దుర్భాషలాడుతూ వారిపై దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో ఎక్సైజ్ వాహనంపై రాళ్లతో దాడి చేసి దానిని పాక్షికంగా నాశనం చేయడం జరిగింది.
ప్రభుత్వ అధికారిని తన విధులు నిర్వహణలో ఆటంకం కలిగించి నందుకు, అధికారిపై సిబ్బంది జరిగిన దాడికి ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్ శ్రీనివాస్ సమీక్షంలో చందంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది.
గువ్వల గుట్టలో నిర్వహించిన తనిఖీలలో 1140 కేజీల నల్ల బెల్లం, 40 కేజీల పటికను రామావత్ హనుమ దగ్గర స్వాధీనం చేసుకోవడం జరిగింది. ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ దేవరకొండ నందు కేసు నమోదు చేయడం జరిగిందని ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్. శ్రీనివాస్ తెలిపారు.
MOST READ :
-
District collector : ధాన్యంలో తేమశాతాన్ని స్వయంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్..!
-
Video : బస్సులో ప్రయాణికురాలి ఆభరణాలు చోరీ చేసిన ఆర్టీసీ బస్ డ్రైవర్.. (వీడియో)
-
Gold Price : మహిళలకు అదిరిపోయే శుభవార్త.. భారీగా రూ. 14,700 తగ్గిన బంగారం ధర..!
-
TG News : 11 నెలలు గడిచినా.. ఇక్కడ ఇంకా సీఎంగా కేసీఆర్ ఫోటోనే..!










