Nelakondapalli : ఖమ్మం జిల్లా ముంపు ప్రాంతాల్లో అధికారుల పర్యటన..!
Nelakondapalli : ఖమ్మం జిల్లా ముంపు ప్రాంతాల్లో అధికారుల పర్యటన..!
నేలకొండపల్లి, మన సాక్షి:
వర్షం వలన ప్రజలు అప్రమతంగా ఉండాలని అధికార యంత్రాంగం సూచించారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం లోని సుర్దేపల్లి, రామచంద్రాపురం, కట్టుకాచారం గ్రామాలలో అదివారం అధికారులు సందర్శించారు. జడ్పీ సీఈవో దీక్షారైనా, డిప్యూటీ సీఈవో నాగలక్ష్మి, ఎంపీడీఓ యం.యర్రయ్య, తహశీల్దార్ ఇమ్రాన్ లు సందర్శించారు.
ముంపు ప్రాంతాలలో ఉంటున్న వారిని కలిసి వర్షాలు, వరద పరిస్ధితి ని తెలియజేశారు. అవసరమైతే మళ్లీ పునరావస కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుందని సూచించారు. అనంతరం ఆయా గ్రామాలలో పారిశుద్ధ్యం పనులను పరిశీలించారు. ఏటీ ఉదృతం ను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
ప్రజలు తాగునీటి ఇబ్బందులు రాకుండా, కలుషితం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వెద్య సేవలను అందించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి శివ, బోదులబండ వైద్యాధికారి డాక్టర్ గీత, వివిధ శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
LATEST UPDATE :
PDS RICE : ఆంధ్ర టు కర్ణాటక.. అక్రమ రేషన్ బియ్యం రవాణా..!
Runamafi : రుణమాఫీ పై స్పష్టత.. మాఫీ కాని వారికి ఎప్పుడంటే..!
Khammam : వరద ప్రాంతాల్లో 820 ప్రత్యేక బృందాలతో వైద్య సేవలు..!
Heavy Rain : భారీ వర్షాలు.. నేడు ఆయా జిల్లాల్లో స్కూళ్లకు సెలవు..!









