తెలంగాణBreaking Newsఖమ్మం జిల్లాజిల్లా వార్తలు

Nelakondapally : రైతులకు రూ.10వేల సహాయం.. మంత్రి పొంగులేటి వెల్లడి..!

Nelakondapally : రైతులకు రూ.10వేల సహాయం.. మంత్రి పొంగులేటి వెల్లడి..!

నేలకొండపల్లి, మన సాక్షి :

వరదలతో పంటలు నష్టపోయిన రైతులకు మరో రెండు రోజుల్లో 10000 రూపాయల సహాయం అందజేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కేంద్రం నుంచి నిధులు వచ్చినా.. రాకపోయినా వరద బాధితులను ఆదుకుంటామని అన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం లోని కట్టుకాచారంలో విద్యుత్ లైన్ పునరుద్దరణ పనులను శనివారం పరిశీలించారు.

పనులు శర వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆదివారం సాయంత్రం లోపు విద్యుత్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడారు… వరదల వలన రాష్ట్రంలో దాదాపు రూ.10.300 -కోట్లు వరకు నష్టం వాటిల్లినట్లు ప్రాధమిక అంచనా వేసినట్లు తెలిపారు.

గత ప్రభుత్వం విపత్తు నిధులు రూ. 1300 కోట్ల ను దారి మళించిందని.ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉందని…కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. రాష్ట్రంలో పూర్తి నష్టం అంచనాలతో ప్రధానమంత్రి ని కలుస్తామని పేర్కొన్నారు.

వరద దెబ్బతిన్న ఇళ్ల కు పరిహారం రూ.16,500 చొప్పున చెల్లించినట్లు తెలిపారు. అదే విధంగా మరో రెండు రోజులలో పంటలు దెబ్బతిన్న రైతులకు రూ.10 వేల ఇస్తామని తెలిపారు.

మార్కెట్ కమిటి చైర్మన్ వెన్నపూసల సీతారాములు. కాంగ్రెస్ నాయకులు కొర్లకుంట్లనాగేశ్వరరావు, బచ్చలకూరి నాగరాజు, జెర్రిపోతుల సత్యనారాయణ, భద్రయ్య, బోయిన వేణు, ఏటుకూరి పుల్లయ్య, బొందయ్య, లక్కం ఏడుకొండలు, కడియాల నరేష్. ఈవూరి శ్రీనివాసరెడ్డి, హనుమంతరావు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

Batti Vikramarka : రైతు రుణమాఫీ పై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్పష్టం..! 

Good News : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో 6000 ఉద్యోగాలు భర్తీ..!

మరిన్ని వార్తలు