ఆంధ్రప్రదేశ్Breaking Newsక్రైం

UPI : యూపీఐ చెల్లింపుల్లో నయా మోసం.. క్షణాల్లో ఖాతా ఖాళీ..!

UPI : యూపీఐ చెల్లింపుల్లో నయా మోసం.. క్షణాల్లో ఖాతా ఖాళీ..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

ప్రస్తుతం ప్రతి చిన్న కొనుగోలు కూడా డిజిటల్ చెల్లింపులే కొనసాగుతున్నాయి. రకరకాల మోసాలతో సైబర్ నేరగాళ్లు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు.

సరికొత్త తరహాలో విజయవాడలో సైబర్ మోసం జరిగింది. విజయవాడలో ఇంటిని అద్దెకు ఇచ్చేందుకు యజమాని ఓఎల్ఎక్స్ లో ప్రకటన చేశారు. అది చూసిన ఒకరు ఇల్లు నచ్చిందని తనకు అద్దెకు కావాలంటూ ఫోన్లో మాట్లాడాడు. తాను ఆర్మీలో పని చేస్తున్నానని చెప్పి అడ్వాన్స్ చెల్లిస్తానని క్యూఆర్ కోడ్ పంపాడు.

దాన్ని స్కాన్ చేస్తే మీకు డబ్బులు వస్తాయని చెప్పడంతో ఇంటి యజమాని క్యూఆర్ కోడ్ స్కాన్ చేశాడు. క్యూఆర్ కోడ్ స్కాన్ అయిన క్షణాల్లోనే ఖాతాలో ఉన్న 4. 34 లక్షల రూపాయలు డెబిట్ అయినట్లు మొబైల్ కు మెసేజ్ వచ్చింది. వెంటనే తేరుకున్న ఇంటి యజమాని తాను మోసపోయానని గమనించాడు.

బాధితుడు వెంటనే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సైబర్ పోలీసులు రంగంలోకి దిగి మోసగాడిని పట్టుకునేందుకు సిద్ధమయ్యారు. ఇలాంటి మోసాలు జరగకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మీకు సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్లు ఎలాంటి అనుమానం వచ్చినా కూడా సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలి.

Similar News :

  1. PhonePe Free Gas : ఫోన్ పే వాడేవారికి గుడ్ న్యూస్.. ఉచిత గ్యాస్ సిలిండర్ ఇలా పొందండి..!

  2. UPI : మీరు ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. జాగ్రత్త, ఇలా చేశారో క్షణాల్లో మీ ఎకౌంట్ ఖాళీ..!
  3. UPI : గూగుల్ పే ఫోన్ పే వాడుతున్నారా.. అయితే జనవరి కొత్త రూల్స్, తప్పక తెలుసుకోవాల్సిందే..!
  4. UPI : ఫోన్ పే, గూగుల్ పే సేవలు నిలిచిపోనున్నాయి.. బిగ్ అలర్ట్..!

మరిన్ని వార్తలు