కొత్త సినిమా గురూ.. విధాత, మార్చి 5న గ్రాండ్ రిలీజ్..!
మదనపల్లి పట్టణ వాసి డాక్టర్ అప్పినపల్లి భాస్కరాచారి నటించి నిర్మించిన విధాత సినిమా సమ్మర్ స్పెషల్ గా మార్చి 5న గ్రాండ్ గా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రేక్షకులను అలరించనుందని భావిస్తున్నారు.

కొత్త సినిమా గురూ.. విధాత, మార్చి 5న గ్రాండ్ రిలీజ్..!
మదనపల్లి, మన సాక్షి :
మదనపల్లి పట్టణ వాసి డాక్టర్ అప్పినపల్లి భాస్కరాచారి నటించి నిర్మించిన విధాత సినిమా సమ్మర్ స్పెషల్ గా మార్చి 5న గ్రాండ్ గా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రేక్షకులను అలరించనుందని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో ఘనంగా విడుదల కానుందని భాస్కరాచారి తెలిపారు. ఏబిసి ప్రొడక్షన్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ తొలి చిత్రం పట్ల సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాధ్యతలను మణికంఠ రాజేంద్ర బాబు నిర్వహించారు. మదనపల్లె కేంద్రంగా స్థానిక నటీనటులతో రూపొందిన ఈ చిత్రం బెంగళూరు, హైదరాబాద్, వైజాగ్ ప్రాంతాల్లో కూడా చిత్రీకరణ జరుపుకుందని తెలిపారు. ఇప్పటికే సెన్సార్ ప్రక్రియ పూర్తి చేసుకున్న ఈ సినిమా కుటుంబ సమేతంగా వీక్షించదగిన సందేశాత్మక చిత్రమని దర్శక, నిర్మాతలు తెలిపారు.
భావోద్వేగం, సందేశం మేళవింపు
‘విధాత’ కథ. ఒక సాధారణ రైతు కూలీ జీవితం చుట్టూ తిరుగుతుంది. కుటుంబాన్ని కోల్పోయిన అనంతరం అతడు ఎదుర్కొన్న కష్టాలు, జీవితంలో తిరిగి నిలబడిన తీరు, తనకు అన్యాయం చేసిన వారికి గుణపాఠం చెప్పిన. విధానం — ఇవన్నీ సమాజానికి స్పష్టమైన సందేశాన్ని అందించేలా తెరకెక్కించబడినట్లు చిత్రబృందం వెల్లడించింది.
హైదరాబాద్ ప్రీమియర్ షోలో సినీ పరిశ్రమ ప్రముఖుల నుండి ప్రశంసలు అందుకున్నట్లు నిర్మాత పేర్కొన్నారు. పాటలు, ఫైట్స్, హాస్యంతో పాటు అద్భుతమైన సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని తెలిపారు. స్వరం అందించారు.
మదనపల్లె నుంచి ఏబిసి ప్రొడక్షన్ స్థాపించి, స్థానిక నటీనటులతో రాష్ట్రవ్యాప్తంగా సినిమా విడుదల చేయడం ఒక సాహసోపేతమని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రేక్షకులు ఆదరిస్థారన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని చిత్రాలు నిర్మించి, కొత్త నటులకు అవకాశాలు కల్పిస్తామని నిర్మాత డా. అప్పినపల్లి భాస్కరాచారి తెలిపారు.
కుటుంబ సమేతంగా చూసేలా రూపొందిన ‘విధాత’ చిత్రాన్ని ఆదరించాలని చిత్ర బృందం కోరింది.
By: KodandaRamreddy, Madanapalle
MOST READ :
- డిఫెన్స్ డ్రైవింగ్ ప్రతి ఒక్కరి బాధ్యత.. జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్..!
- TG : తెలంగాణలో పింఛన్ల పెంపు, మహిళలకు రూ.2500 ఎప్పటినుంచంటే..!
- Fake Company : నకిలీ సంస్థ పేరిట మ్యూల్ ఖాతాలు.. బ్యాంకు మేనేజర్ సహా నలుగురి అరెస్ట్..!
- Hyderabad : హైదరాబాదులో దారుణం.. రెండు నెలల శిశువు కాళ్లు, చేతులు కట్టేసి పొయ్యిలో పడేసి హత్య చేసిన కన్నతల్లి..!










