New Year : న్యూ ఇయర్ బంపర్ ఆఫర్లు.. కిలో కొంటే.. అర కిలో ఫ్రీ..!
New Year : న్యూ ఇయర్ బంపర్ ఆఫర్లు.. కిలో కొంటే.. అర కిలో ఫ్రీ..!
మన సాక్షి:
ప్రపంచం అంతటా కొత్త సంవత్సరం వేడుకల కోసం సిద్ధమవుతోంది. న్యూ ఇయర్ కోసం అందరూ ఎంతో ఉల్లాసంగా…ఉత్సహంగా ఎదురు చూస్తూ 31 నైట్ పార్టీ కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. హ్యాపీ న్యూయర్ అంటూ అందరితో కలిసి పార్టీలు చేసుకుని…తమ సంతోషాన్ని పంచుకునేందుకు ఉవ్విల్లూరుతున్నారు.
ఆపర్లే…ఆపర్లు :
అందులో భాగంగానే న్యూ ఇయర్ సందర్భంగా బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నారు వ్యాపారులు. మా హోటల్ మీ గర్ల్ ఫ్రెండ్‌తో, మీ ఫ్యామిలీతో రూం బుక్ చేసుకుంటే…వైన్, ఫుడ్ ఫ్రీ అని కొందరంటుంటే…మీ గర్ల్ ఫ్రెండ్ తాగినంత మందు ఫ్రీ అని కొన్ని రెస్టారెంట్, పబ్బులు ప్రకటిస్తున్నాయి. ఇక కొన్ని బెకరీలైతే…కిలో కేక్ కొంటే…అర కిలో ఫ్రిగా ఇస్తామని ప్రకటిస్తున్నాయి.
స్టార్ల సందడి :
చాలా ఈవెంట్ సంస్థలు బాలీవుడ్ తారలతో న్యూ ఇయర్ వేడుకలను ప్లాన్ చేస్తున్నాయి. కొన్ని చోట్ల న్యూ ఇయర్ వేడుకల్లో జబర్దస్త్ టీం, టాలీవుడ్ తారలు తళుక్కుమననున్నారు. చాలా చోట్ల సంగీత కళాకారులతో గానా బజానా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
తగ్గేదే లేదంటున్న యూత్ :
న్యూ ఇయర్ వేడుకల కోసం…డబ్బున్న వాళ్ళు పబ్బులు, క్లబ్బులు, రిసార్ట్స్‌లకు వెళ్తుంటే…మద్య తరగతి వాళ్ళు ఇళ్ళలోనే ప్లాన్ చేసుకుంటున్నారు. చాలా మంది బ్యాచ్లర్స్ ఫ్రెండ్స్‌తో నయా సాల్ కా దావత్‌కు రెడీ అవుతున్నారు. ఏదీ ఏమైనా న్యూ ఇయర్ వేడుకలను ఫుల్ జోష్‌తో జరుపుకోవడం మాత్రం పక్కా అంటున్నారు యువత.
పొంగి పోర్లనున్న మద్యం :
ఈ న్యూ ఇయర్ వేడుకల్లో మందు ఏరులై పారనుంది. డిసెంబర్ 31 వేడుకల్లో 1000 కోట్ల మందు అమ్మాలని ఎక్సైజ్ శాఖ టార్గెట్‌గా పెట్టుకుంది. అందుకోసమే…బార్లు, వైన్ షాపులు, బెల్ట్ షాపులకు నిబంధనలు సడలించారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో ఎంత మద్యం అమ్మాలో లెక్కలు వేసుకున్నారట అబ్కారీ అధికారులు.
పైలం బిడ్డ :
ప్రతి ఏటా న్యూ ఇయర్ వేడుకల్లో చాలా మంది యాక్సిడెంట్ల బారిన పడి…చనిపోతున్నారు. మరికొంత మందికి ప్రాణాలు మిగిలినా జీవచ్చవాలుగా మిగులుతున్నారు. వీరిలో ఎక్కువ శాతం యువతే ఉంటటం విశేషం. మద్యం మత్తులో ఏటేటా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అందుకే న్యూ ఇయర్ వేడుకలంటేనే చాలా మంది తల్లిదండ్రులకు భయం పట్టుకుంటుంది.
అందుకే తమ పిల్లలకు పైలం బిడ్డా అని ముందుగానే హెచ్చరిస్తున్నారు. అందుకే డియర్ యూత్. అండ్ ఆల్ పీపుల్ మద్యం సేవించి న్యూ ఇయర్ వేడుకల పేరుతో రోడ్లపైకి రాకండి. విలువైన ప్రాణాలను కాపాడుకోండి. కన్నవారికి కడుపుకోత మిగల్చకండి. మన సాక్షి పాఠకులందరికీ నూతన సంత్సర శుభాకాంక్షలు తెలుపుతోంది.
Reporting :
MahipalReddy, Hyderabad
MOST READ :
-
Gold Price : కొత్త సంవత్సరం ముందే భారీ షాక్.. రెండు రోజుల తర్వాత పెరిగిన బంగారం ధర..!
-
Rythu Bharosa : రైతు భరోసా పై ప్రత్యేక యాప్.. ఆన్ లైన్ లో ధరఖాస్తులు..!
-
TG News : రైతులకు తెలంగాణ సర్కార్ శుభవార్త.. భూ భారతితో వారికి మోక్షం..!
-
Rythu Bharosa : రైతు భరోసా పై మరో కీలక నిర్ణయం.. ముగిసిన కేబినెట్ సబ్ కమిటీ భేటీ.. లేటెస్ట్ అప్డేట్..!









