జిల్లా వార్తలుBreaking Newsనిజామాబాద్పండుగలు

Nizamabad : మిన్నంటిన హనుమాన్ జయంతి వేడుకలు..!

నిజామాబాద్ జిల్లా ఆలూర్ పట్టణ కేంద్రంలో హనుమాన్ జయంతి వేడుకలు గురువారం అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక ఉత్సహంతో జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక వాగు గడ్డ జంబి హనుమాన్ ఆలయంలో వేకువజాము నుండే భక్తుల రద్దీ నెలకొనగా, అర్చకులు స్వామివారికి అభిషేకాలు, సింధూర అలంకరణలు మరియు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Nizamabad : మిన్నంటిన హనుమాన్ జయంతి వేడుకలు..!

ఆర్మూర్, మన సాక్షి ;

నిజామాబాద్ జిల్లా ఆలూర్ పట్టణ కేంద్రంలో హనుమాన్ జయంతి వేడుకలు గురువారం అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక ఉత్సహంతో జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక వాగు గడ్డ జంబి హనుమాన్ ఆలయంలో వేకువజాము నుండే భక్తుల రద్దీ నెలకొనగా, అర్చకులు స్వామివారికి అభిషేకాలు, సింధూర అలంకరణలు మరియు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

హనుమాన్ దీక్షలో ఉన్న అంజన్న స్వాములు సామూహికంగా హనుమాన్ చాలీసా, దండక పారాయణం చేస్తూ భక్తి పారవశ్యంలో మునిగితేలారు. అనంతరం పట్టణ వీధుల్లో నిర్వహించిన భారీ శోభాయాత్ర భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. డీజేల హోరు, భక్తి గీతాల నడుమ యువకులు ఉత్సాహంగా నృత్యాలు చేయగా, “జై శ్రీరామ్” నినాదాలతో పురవీధులన్నీ మారుమోగాయి. ఈ వేడుకల్లో భాగంగా భక్తులందరికీ భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా గ్రామ అధ్యక్షులు మగ్గిడి సూర్య మాట్లాడుతూ.. ప్రతి ఏటా హనుమాన్ జయంతిని గ్రామస్తుల సహకారంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని, ఈ ఏడాది కూడా భక్తులు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, యువత, మహిళలు మరియు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

MOST READ 

మరిన్ని వార్తలు