Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Nalgonda: కోమటిరెడ్డి కాదు.. కోడిగుడ్డు రెడ్డి..!

Nalgonda: కోమటిరెడ్డి కాదు.. కోడిగుడ్డు రెడ్డి..!

మంత్రి అయ్యాక నల్లగొండలో పట్టుమని రెండు రోజులు లేవు.

బైపాస్ నిర్మాణంలో ఆప్షన్ 3 రద్దు చేయాలి

మంత్రి పై ఫైర్ అయిన నల్లగొండ బీజేపీ అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి.

నల్లగొండ, మన సాక్షి :

నల్లగొండ బైపాస్ నిర్మాణంలో ఆప్షన్ త్రీ వలన మంత్రితో పాటు ఆయన అనుచరులకు లాభం ఉందని అలాగే వందలాది మంది నిరుపేద ప్రజలకు భారీ నష్టం జరుగుతుందని వెంటనే ఆప్షన్ త్రీ ని రద్దుచేసి ఆప్షన్ వన్ ప్రకారం బైపాస్ రోడ్డు నిర్మించాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.

బైపాస్ నిర్మాణంలో ఇళ్లస్థలాలు కోల్పోతున్న బాధితులు అనేకమంది బుధవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డిని కలిసి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. ఆప్షన్ త్రీ ని రద్దు చేసి తమను కాపాడాలని మంత్రికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్న పట్టించుకోవడంలేదని ఆరోపించారు.

 

పైసా పైసా కూడా పెట్టి పిల్లల పెండ్లి కోసం ప్లాట్లు కొని పెడితే ఆ ప్లాట్ ల నుండి బైపాస్ రోడ్డు చేపడితే తమకు ఆత్మహత్య శరణ్యమని బాధితులు గో. ఎలాగైనా ఆప్షన్ త్రీ ప్రకారం బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని ఆపివేయాలని వర్షిత్ రెడ్డి కోరారు.
ఈ సందర్భంగా జిల్లా బిజెపి అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రింగ్ రోడ్డును వారి అనుయాయుల కోసం వారి తొత్తుల కోసం ఆప్షన్ వన్ వదిలేసి 3 నీ తీసుకోవడం వెనుక పెద్ద కుట్ర ఉందన్నారు.

కోమటిరెడ్డి కాదు కోడిగుడ్డు రెడ్డి అని ఎద్దేవా చేశారు మంత్రి అయ్యాక పట్టుమని రెండు రోజులు కూడా నల్లగొండలో లేడని హైదరాబాద్ బెంగళూరు లోని ఏసీ రూములలో ఉంటూ పాలన సాగిస్తున్నారన్నారు. ఆప్షన్ త్రీ ని రద్దుచేసి ఆప్షన్ వన్ ను తీసుకోకుంటే బిజెపి ఆధ్వర్యంలో పోరాటం చేయడమే కాకుండా కోమటిరెడ్డి ఇంటిని ముట్టడిస్తామని ధర్నాలు చేస్తామని. కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకువస్తామని హెచ్చరించారు.

 

ALSO READ : 

Runa mafi : తెలంగాణలో రుణమాఫీకి డేట్ ఫిక్స్.. కీలక అప్ డేట్, ఆ తేదీ నుంచే ప్రక్రియ ప్రారంభం..!

Aadhar: ఆధార్ కార్డు ఉంటే కుట్టు మిషన్ ఉచితం.. ఈరోజే దరఖాస్తు చేసుకోండి..!

SURYAPET : సూర్యాపేటలో అరుదైన జాతి పాము.. భయభ్రాంతులకు గురైన ప్రజలు, నాలుగు గంటలు శ్రమించి పట్టుకున్న స్నేక్స్ స్నాచర్..!

మరిన్ని వార్తలు