Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsviralజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

SURYAPET : సూర్యాపేటలో అరుదైన జాతి పాము.. భయభ్రాంతులకు గురైన ప్రజలు, నాలుగు గంటలు శ్రమించి పట్టుకున్న స్నేక్స్ స్నాచర్..!

SURYAPET : సూర్యాపేటలో అరుదైన జాతి పాము.. భయభ్రాంతులకు గురైన ప్రజలు, నాలుగు గంటలు శ్రమించి పట్టుకున్న స్నేక్స్ స్నాచర్..!

సూర్యాపేట , మనసాక్షి :

సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో 27వ వార్డులో అరుదైన పాము గత మూడు రోజుల నుండి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది.. విషయాన్ని వార్డు ప్రజలు వార్డు ప్రజలు కౌన్సిలర్ చిరివెళ్ల లక్ష్మీకాంతమ్మ వెంకటేశ్వర్లు దృష్టికి తీసుకువెళ్లగా స్పందించిన కౌన్సిలర్ ఫోన్ ద్వారా డీఎఫ్ఓ సంప్రదించారు.

అనంతరం కౌన్సిలర్ కు స్నేక్ స్నాచర్ సంప్రదించాలని తెలిపాగా కౌన్సిలర్ ఖమ్మం నుండి స్నేక్ స్నాచర్ గోపిను పిలిపించారు. మంగళవారం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు శ్రమించి ఎట్టకేలకు అరుదైన జాతి పామును స్నేక్ స్నాచార్ పట్టుకున్నారు.

అనంతరం వార్డ్ కౌన్సిలర్ తనయుడు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సిలివేరు శబరి మాట్లాడుతూ పాములను ఎవరు చంపకుండా సంబంధిత అధికారులకు తెలియజేస్తే స్నేక్ సొసైటీ వారిని పిలిపించి పట్టియడం జరుగుతుందని తెలిపారు.

స్నేక్ సొసైటీ వారికి కూడా జీతాలు కూడా లేవని… ప్రతి ఫారెస్ట్ జిల్లా కేంద్రంలో ముగ్గురు స్నేక్ స్లాచర్లు ఉండాలని కోరారు.. స్నేక్ సొసైటీ వారు అందుబాటులో ఉంటే అనేక జీవరాసులు బతుకుతాయని అన్నారు.. స్నేక్ సొసైటీ వారిని ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చేర్చుకొని గౌరవ వేతనాలు ఇవ్వాలని కోరారు.

గత మూడు రోజుల నుంచి ఈ పాము భయభ్రాంతులకు గురి చేస్తుందని వార్డు ప్రజలు తెలిపారు. వెంటనే కౌన్సిలర్ స్పందించి పామును బంధించడంతో భయం పోయిందని ప్రజలు కౌన్సిలర్ కు ధన్యవాదములు తెలిపారు.

ALSO READ : 

Cm Revanth Reddy : తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్లు వారికి మాత్రమే.. రేవంత్ రెడ్డి నిర్ణయం..!

NALGONDA : పాలన పటిష్టతకు ప్రతి సోమవారం మండల స్థాయిలో ప్రజావాణి.. నూతన జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి పిలుపు..!

BRS : గులాబి బాస్ స్థానం ఆతడిదేనా.. పార్టీలో అంతర్మథనం..!

WhatsApp : వాట్సాప్ లో ఆ పేరుతో ఏదైనా లింకు వచ్చిందా.. క్లిక్ చేశారో..!

మరిన్ని వార్తలు