WhatsApp : వాట్సాప్ లో ఆ పేరుతో ఏదైనా లింకు వచ్చిందా.. క్లిక్ చేశారో..!

ప్రస్తుతం స్మార్ట్ ఫోను వినియోగించని వారంటూ లేరు. అంతే కాకుండా వాట్సాప్ కూడా ప్రతి ఒక్కరు ఉపయోగిస్తున్నారు. ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్ లో వాట్సాప్ ఉంది

WhatsApp : వాట్సాప్ లో ఆ పేరుతో ఏదైనా లింకు వచ్చిందా.. క్లిక్ చేశారో..!

ManaSakshi :

ప్రస్తుతం స్మార్ట్ ఫోను వినియోగించని వారంటూ లేరు. అంతే కాకుండా వాట్సాప్ కూడా ప్రతి ఒక్కరు ఉపయోగిస్తున్నారు. ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్ లో వాట్సాప్ ఉంది. కోట్లాదిమంది వాట్సప్ యాప్ లో ఉపయోగిస్తున్నారు. దాంతో సైబర్ కేటుగాళ్లు కూడా వాట్సాప్ ను వినియోగించుకుంటున్నారు. రకరకాల లింకులను పంపుతూ మోసాలకు పాల్పడుతున్నారు.

 

పెరుగుతున్న టెక్నాలజీ ఆధారంగా సైబర్ నేరగాళ్లు ఎక్కువగా అనేక రకాల మోసాలకు పాల్పడుతున్నారు. కొత్త కొత్త రకాల మోసాలు వెలుగులోకి వస్తున్నా ప్రజలు ఇంకా అప్రమత్తం కావడం లేదు. కొత్త కొత్త రకంగా ప్రజలను నిండా ముంచేస్తున్నారు. తాజాగా ఇలాంటి మోసం ఒకటి వెలుగులోకి వచ్చింది.

 

ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఇచ్చోడలో ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. సిరికొండ మండలం సోంపల్లి గ్రామానికి చెందిన ఒక వాట్సాప్ గ్రూప్లో పీఎం కిసాన్ పేరుతో యాప్ లింకు వచ్చింది. ఆ లింకు ఏంటని ఒక వ్యక్తి క్లిక్ చేశాడు. వెంటనే వారి వాట్సాప్ పూర్తిగా అవతలి వారి చేతుల్లోకి వెళ్లిపోయింది. వాట్సాప్ ఎంతకి ఓపెన్ కాకపోవడం ఇతర యాప్ లు ఓపెన్ కావడం.. వాట్సాప్ గ్రూపులకు వాటంతటవే మెసేజ్ లు ఫార్వర్డ్ కావటం జరిగింది.

 

దాంతో తన ఫోన్ హ్యాక్ గురైందని భావించి సదరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై సైబర్ క్రైమ్ డిఎస్పి హసీద్ ఉల్లా మాట్లాడుతూ.. మొబైల్ లో వచ్చే యాప్ ల పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దాంతోపాటు పీ ఎం కిసాన్ యాప్ లను ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయవద్దని తెలిపారు. ఎవరైనా సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి సంప్రదించాలని ఆయన కోరారు.

 

ALSO READ : 

WhatsApp : వాట్సాప్ లో డిలీట్ చేసిన మెసేజ్ లు చూడొచ్చు.. చాలా ఈజీ ఇది అందరికీ తెలియదు..!

గడ్డిమందు తాగితే రూ.లక్ష పందెం.. ఒప్పుకుని మందు సేవించిన వ్యక్తి..!

TELANGANA : పోలీస్ అకాడమీలో ఐఏఎస్ ట్రైనీ కుమార్తెకు తండ్రి ఎస్పీ సెల్యూట్..!

BREAKING : మిర్యాలగూడలో గంజాయి విక్రయిస్తున్న 12మంది అరెస్ట్.. తండ్రి కొడుకులే సూత్రధారులు..!