BREAKING : మిర్యాలగూడలో గంజాయి విక్రయిస్తున్న 12మంది అరెస్ట్.. తండ్రి కొడుకులే సూత్రధారులు..!

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో గంజాయి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. గంజాయి విక్రయించే ముఠాకు తండ్రి కొడుకులే సూత్రధారులుగా ఉన్నారు.

BREAKING : మిర్యాలగూడలో గంజాయి విక్రయిస్తున్న 12మంది అరెస్ట్.. తండ్రి కొడుకులే సూత్రధారులు..!

మన సాక్షి,  మిర్యాలగూడ :

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో గంజాయి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. గంజాయి విక్రయించే ముఠాకు తండ్రి కొడుకులే సూత్రధారులుగా ఉన్నారు. యువతకు గంజాయి అలవాటు చేసి, వారి ద్వారా గంజాయిని విక్రయిస్తూ మాదక ద్రవ్యాలకు బానిసలుగా చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నట్లు మిర్యాలగూడ డి.ఎస్.పి రాజశేఖర్ రాజు తెలిపారు.

సోమవారం సాయంత్రం డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకుగత కొన్ని రోజులుగా పోరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నుండి కొంతమంది వ్యక్తులు అక్రమంగా గంజాయి ని తీసుకువచ్చి దామరచర్ల మిర్యాలగూడ మండలాలలో యువతకు గంజాయి విక్రయిస్తూ . వారిద్వారా గంజాయి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారని తెలిపారు.

నల్గొండ ఎస్పీ ఆదేశాల మేరకు తన పర్యవేక్షణలో మిర్యాలగూడ రూరల్ సీఐ కే వీరబాబు ఆధ్వర్యంలో వాడపల్లి ఎస్సై మరియు వారి సిబ్బందితో కలిసి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి గంజాయి అమ్మే వ్యక్తులను 12 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఇందులో ప్రధానంగా దాచేపల్లి మండలానికి చెందిన సాకేటి తిరుపతి నారం నాయుడు అతని తండ్రి సాకేటి నారం పోలి నాయుడులు సూత్రధారులుగా ఉన్నారు. తమకు పరిచయం ఉన్న విశాఖపట్నం జిల్లా పాడేరు నుండి బాబి అనే వ్యక్తి దగ్గర గంజాయి కొని రైళ్లలో బస్సులలో పల్నాడు జిల్లా దాచేపల్లి కి తరలించి అక్కడి నుండి తెలంగాణ సరిహద్దు దామచర్ల మిర్యాలగూడ మండలాల్లో విక్రయిస్తున్నారు.

గంజాయిని చిన్న పొట్లాలు, సిగరెట్ పీకలు మాదిరిగా రూపొందించుకొని విక్రయిస్తూ వారి ద్వారా మరల గంజాయి 30 గ్రాముల ప్యాకెట్లుగా తయారుచేసి విక్రయిస్తున్నారని వివరించారు. గంజాయి అమ్మడమే కాకుండా యువతను తప్పుదోవ పట్టిస్తూ వారి అనారోగ్యానికి కారణం అవుతున్న వారిని అదుపులోకి తీసుకున్నట్లు డిఎస్పి వివరించారు .

సోమవారం ఉదయం తమకు ఈ విషయమే నమ్మదగిన సమాచారం రాగా వాడపల్లి ఎస్సై తన సిబ్బందితో కలిసి బత్తల పాలెం గ్రామ శివారులోని రైల్వే అండర్ పాస్ వద్ద అదే సమయంలో 12 మంది నేరస్తులు వారి వద్ద నుండి మూడు మోటర్ బైక్లను , గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇలాంటి నేరస్థుల విషయంలో గుర్తించి పోలీసులపై ప్రజలకు మరింత నమ్మకం కలిగేలా చేసిన మిర్యాలగూడ రూరల్ సీఐ, వాడపల్లి ఎస్సైలను ఆయన అభినందించారు.

సమావేశంలో రూరల్ సీఐ వీరబాబు వన్ టౌన్ టు టౌన్ సిఐలు సుధాకర్. నాగరాజు ఎస్సైలు రవికుమార్. శోభన్ బాబు. విజయ్ కుమార్. కానిస్టేబుల్ రవి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

యువత తల్లిదండ్రులకు డిఎస్పి సూచన : 

ప్రస్తుత సమాజంలో తమ పిల్లల నడవడికను ముందుగా తల్లిదండ్రులు గుర్తించాలని వారి నడవడిక, ప్రవర్తన, అలవాటులో మార్పులను గమనించి జాగ్రత్త వహిస్తే వారి భవిష్యత్తు కాపాడిన వారు అవుతారని డి.ఎస్.పి కే రాజశేఖర్ రాజు తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.గంజాయి. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారి వివరాలను తెలియజేయలని కోరారు. వారి నెంబర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.