గడ్డిమందు తాగితే రూ.లక్ష పందెం.. ఒప్పుకుని మందు సేవించిన వ్యక్తి..!

ఇద్దరు వ్యక్తులు కాసిన పందెం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది

గడ్డిమందు తాగితే రూ.లక్ష పందెం.. ఒప్పుకుని మందు సేవించిన వ్యక్తి..!

శంకర్‌పల్లి: (మన సాక్షి):

ఇద్దరు వ్యక్తులు కాసిన పందెం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. గడ్డి మందు తాగితే రూ.లక్ష అంటూ పందెం కాయగా, ఓ వ్యక్తి తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. శంకర్‌పల్లి పోలీ స్ స్టేషన్ పరిధిలోని చందిప్ప గ్రామానికి చెందిన సురేశ్ (45) వారం రోజుల క్రితం గ్రామంలోని ఇద్దరు వ్యక్తులు పొలం వద్ద గడ్డి మందు తాగితే రూ.లక్ష అంటూ పందెం కాశారు.

ఈ క్రమంలో సురేశ్ గడ్డి మందు తాగాడు. అతను అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో వెంటనే చికిత్స కోసం సంగారెడ్డి ఆసుపత్రికి తర లించారు. మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆసుప త్రికి తరలించారు.

చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందాడు. మృతుడికి భార్య అనిత, కూతుళ్లు నవీన, నందిత ఉన్నారు. మృతుడి అన్న సుధాకర్ ఫిర్యాదు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శంకర్‌పల్లి పోలీసులు తెలిపారు.

ALSO READ : 

Jagan : ప్రత్యేక హోదాపై జగన్ సంచలన వ్యాఖ్యలు.. అడగకపోతే చంద్రబాబు చేసిన మరో పాపం..!