Runa mafi : తెలంగాణలో రుణమాఫీకి డేట్ ఫిక్స్.. కీలక అప్ డేట్, ఆ తేదీ నుంచే ప్రక్రియ ప్రారంభం..!

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు వెళుతుంది. ముఖ్యమైన హామీలలో రుణమాఫీ కూడా ఉంది. ఆగస్టు 15వ తేదీలోగా రుణమాఫీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.

Runa mafi : తెలంగాణలో రుణమాఫీకి డేట్ ఫిక్స్.. కీలక అప్ డేట్, ఆ తేదీ నుంచే ప్రక్రియ ప్రారంభం..!

మన సాక్షి :

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు వెళుతుంది. ముఖ్యమైన హామీలలో రుణమాఫీ కూడా ఉంది. ఆగస్టు 15వ తేదీలోగా రుణమాఫీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అప్పటివరకు రుణమాఫీ చేయాలని టార్గెట్ పెట్టుకున్న ప్రభుత్వం కార్యాచరణ వేగవంతం చేసింది.

రుణమాఫీ కోసం నిధుల సమీకరణ చేస్తూనే మరోవైపు అర్హులను తేల్చే పనిలో ఉన్నారు. ఇప్పటికే దానిపై అధికారులు ఓ కార్యచరణ కూడా సిద్ధం చేశారు. అర్హులను గుర్తించేందుకు ఓ నిర్ణయం తీసుకోవడానికి గాను ఈనెల 21వ తేదీన మంత్రిమండలి సమావేశం జరగనున్నది. 21వ తేదీన నిర్వహించే తెలంగాణ మంత్రిమండలి సమావేశంలో ముఖ్యంగా రుణమాఫీ అంశం ఉంటుందని చెప్పవచ్చును.

రుణమాఫీ ఎవరెవరికి చేయాలి, ఏ విధంగా చేయాలని అంశాన్ని కీలకంగా చర్చించనున్నారు. ఇది ఇలా ఉండగా ఆగస్టు 15 వరకు వేచి ఉండకుండా ముందే రుణమాఫీని ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది. జులై 17వ తేదీ నుంచి రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. జులై నుంచి వ్యవసాయ పనులు ఊపందుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకు వ్యవసాయ పనులు ప్రారంభంలోనే రైతులకు రుణమాఫీ చేసి తీరాలని ప్రభుత్వం భావిస్తుంది. జూలై 17వ తేదీ నుంచి రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించి ఆగస్టు 15వ తేదీ వరకు పూర్తి చేయాలని భావిస్తున్నారు.

పిఎం కిసాన్ పథకంలో ఉన్న నిబంధనల ప్రకారమే మొత్తం మూడు విడతల్లో అప్పులు తీర్చేయనున్నారని సమాచారం. పీఎం కిసాన్ సమ్మన్ పథకం ప్రజాప్రతినిధులు, ఐటి కడుతున్న వాళ్లకు, ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించడం లేదు. అదేవిధంగా రుణమాఫీని కూడా అదేవిధంగా వర్తింపజేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపుతున్నారు. రాష్ట్రంలో అప్పులు పెరిగి ఉన్నప్పటికీ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీని చేయాలని సంకల్పంతో రేవంత్ రెడ్డి ఉన్నారు. ఏది ఏమైనా ఆగస్టు 15వ తేదీ నాటికి రైతుల్లో సంతోషం చూడాలన్నదే ఆయన కోరిక. ఆ ప్రకారంగా కార్యాచరణ చేపట్టాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

ALSO READ : 

Hyderabad : ఐటి కారిడార్ లో బైక్ రేసింగ్.. బైకులు వదిలి పారిపోయిన యువకులు ఎందుకో..?

BREAKING : మిర్యాలగూడలో గంజాయి విక్రయిస్తున్న 12మంది అరెస్ట్.. తండ్రి కొడుకులే సూత్రధారులు..!

BRS : గులాబి బాస్ స్థానం ఆతడిదేనా.. పార్టీలో అంతర్మథనం..!

WhatsApp : వాట్సాప్ లో డిలీట్ చేసిన మెసేజ్ లు చూడొచ్చు.. చాలా ఈజీ ఇది అందరికీ తెలియదు..!