TOP STORIESBreaking Newsవ్యవసాయం

Rythu Bharosa : ఏదీ రైతు భరోసా.. ఆర్థిక శాఖ పక్కన పెట్టిందా.. లేటెస్ట్ అప్డేట్..!

Rythu Bharosa : ఏదీ రైతు భరోసా.. ఆర్థిక శాఖ పక్కన పెట్టిందా.. లేటెస్ట్ అప్డేట్..!

Rythu Bharosa : తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ రైతు భరోసా పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం సాగు చేస్తున్న రైతులందరికీ రాకపోవడంతో గందరగోళమైన పరిస్థితి నెలకొన్నది. తక్కువ భూమి ఉన్నప్పటికీ తమకు రైతు భరోసా డబ్బులు రాలేదని రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.

ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది తర్వాత రైతు భరోసా పథకాన్ని ప్రారంభించింది. 2025 జనవరి 26వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభిస్తూ ఎకరానికి 12,000 చొప్పున రైతులకు పంట పెట్టుబడి సహాయం అందజేస్తామని చెప్పారు. ఒక విడత రైతు భరోసా ఆరువేల రూపాయలను వారి వారి రైతు ఖాతాలలో జమ చేస్తామని పేర్కొన్నారు.

అయితే ఈ పథకం ప్రారంభించిన తర్వాత తొలి విడతలో 17.03 లక్షల మంది రైతులకు 9.29 లక్షల సాగు భూమికి 557.54 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేసింది. రెండవ విడతలో రెండు ఎకరాల వరకు ఉన్న రైతులకు 13.23 లక్షల మందికి 18.19 లక్షల ఎకరాలకు 1091.95 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేసింది.

ఇది ఇలా ఉండగా మూడవ విడతలో మూడు ఎకరాల లోపు ఉన్న రైతులకు 21.12 లక్షల ఎకరాలకు 10.13 లక్షల మంది రైతులకు 1269.32 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేసింది. కాగా ఇప్పటివరకు మూడు ఎకరాల లోపు సాగు చేస్తున్న రైతులకు 3000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలో రైతు భరోసా జమ చేసింది.

కానీ అనేక మందికి రైతు భరోసా డబ్బులు జమ కాలేదు. దాంతో రైతు భరోసా కేంద్రాలను కూడా వ్యవసాయ శాఖ కార్యాలయాలలో ప్రారంభించింది. రైతుల నుంచి వస్తున్న ఫిర్యాదులను స్వీకరించింది. ఇదిలా ఉండగా తెలంగాణ ప్రభుత్వం సాగయ్యే భూములకు మాత్రమే రైతు భరోసా అందజేస్తామని తెలియజేసిన విషయం తెలిసిందే.

కానీ ప్రస్తుతం సాగు చేస్తున్న రైతులకు కూడా రైతు భరోసా రాలేదు. అలా జరగడానికి కూడా ఆ సర్వే నెంబర్లు ఏదైనా కొంత భూమి సాగుకు యోగ్యం లేకుండా ఉన్నట్లయితే ఆ సర్వే నెంబర్ మొత్తం బ్లాక్ లిస్టులో ఉండి పెట్టుబడి సహాయం జమ కాలేదని తెలుస్తుంది.

ఈ సమస్యను పరిష్కరించేందుకు వ్యవసాయ శాఖ, రెవిన్యూ శాఖ సమన్వయంతో పని చేస్తున్నాయి. అయితే రైతుల వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి రైతు భరోసా కోసం ఆర్థిక శాఖకు పంపినట్లు వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికీ మూడు ఎకరాల లోపు ఉన్న రైతులకు మూడు వేల కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం రైతు భరోసా నిధులు జమ చేయగా సాంకేతిక కారణాల వల్ల ఆ ప్రాసెస్ ఆగిపోయింది.

సాంకేతిక కారణాలను దృష్టిలో పెట్టుకొని ఆర్థిక శాఖ మిగిలిన రైతు భరోసాను పక్కన పెట్టినట్లు సమాచారం. సాంకేతిక సమస్యలు పరిష్కారం అయిన తర్వాత రైతు భరోసా అందించే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరించి మార్చి నెలలో మూడు ఎకరాల పైబడిన రైతులకు, రైతు భరోసా రాని రైతులకు కూడా నిధులు జమ చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు.

Similar News :

  1. Rythu Bharosa : రైతు భరోసా పై ప్రభుత్వం క్లారిటీ.. తక్కువ వచ్చిందా.. అసలు రాలేదా.. ఇలా చేయండి..!

  2. Rythu Bharosa : రైతు భరోసా రాలేదా.. వారికోసం ప్రత్యేక కేంద్రాల ఏర్పాటు..!

  3. Rythu Bharosa : రైతు భరోసా దరఖాస్తు చేసుకున్నారా.. వ్యవసాయ శాఖ గుడ్ న్యూస్.. లేటెస్ట్ అప్డేట్..!

  4. Rythu Bharosa : రైతు భరోసా గందరగోళం.. వారికి రానట్లేనా.. అధికారులు ఏమంటున్నారంటే..!

  5. Rythu Bharosa : రైతులకు భారీ షాక్.. వారికి రైతుభరోసా కట్..!

మరిన్ని వార్తలు