Breaking Newsతెలంగాణరాజకీయం
Phone Tapping : ఫోన్ టాపింగ్ కేసులో నలుగురు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు.. జిల్లా వ్యాప్తంగా చర్చ..!
Phone Tapping : ఫోన్ టాపింగ్ కేసులో నలుగురు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు.. జిల్లా వ్యాప్తంగా చర్చ..!
మన సాక్షి , తెలంగాణ బ్యూరో :
ఫోన్ టాపింగ్ కేసులో నలుగురు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ అయినట్లు సమాచారం. మహబూబ్ నగర్, నల్లగొండ ఉమ్మడి జిల్లాల్లో నలుగురు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ అయినట్లు తెలుస్తోంది. ఫోరెన్సిక్ ఆధారంగా వారికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే నలగొండ జిల్లా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా మరో ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు ఎవరనేది తెలియాల్సి ఉంది.
ఈ విషయంపై మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాలో సర్వత్ర చర్చ సాగుతుంది. ఫోన్ టాపింగ్ లో నోటీసులు అందుకున్న మరో ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరై ఉంటారనే విషయం రాజకీయ వర్గాల్లో సంచలనం కలిగిస్తుంది.
MOST READ :
-
Gold Price : మహిళలకు అదిరిపోయే శుభవార్త.. భారీగా రూ. 14,700 తగ్గిన బంగారం ధర..!
-
Miryalaguda : ధాన్యం కొనుగోలులో మోసాలకు పాల్పడితే చర్యలు.. జిల్లా ఎస్పీ హెచ్చరిక..!
-
TG News : మాజీ సీఎం కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్..!
-
Family Survey : మీ ఇంట్లో వాషింగ్ మిషన్ ఉందా..? సర్వే అంతా కోడ్ లోనే..!









