Nregs : నిలువ నీడ లేదు..!

Nregs : నిలువ నీడ లేదు

కంగ్టి, మన సాక్షి :

వేసవిలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ పథకం మొదట్లో పనులు చేసేందుకు కూలీలకు పరికరాలు గడ్డపారలు, పారలు, ఇనుప తట్టలు, గొడ్డళ్లు ఇచ్చేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కూలీలే పరికరాలు సొంతంగా కొనుగోలు చేసుకోవాల్సి వస్తుంది.

 

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులకు వెళ్లిన కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించడంలేదు.

 

కూలీలు నానా అవస్థలు పడుతున్నారు. వేసవిలో కూలీలకు టెంటు సౌకర్యం కల్పించక పోవడంతో చెట్ల నిడే ఆధారమవుతోంది. త్రాగునీటిని కూలీలే తెచ్చుకుంటున్నారు. ప్రథమ చికిత్స కిట్లు పరికరాలు ఇవ్వడంలేదు. ప్రభుత్వం తమ ఆవేదనను అర్థం చేసుకోని అన్ని ఏర్పాట్లు చేయాలని ఉపాధి కూలీలు కోరారు.

 

కూలీలు పనులు చేసుకుని సేద తీరేందుకు కూడా కనీసం టెంట్ సౌకర్యం లేకపోవడంతో ఎండలోనే కూర్చునే పరిస్థితి వచ్చింది.