Srisailam : శ్రీశైలం ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తిన అధికారులు..!
Srisailam : శ్రీశైలం ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తిన అధికారులు..!
మన సాక్షి , నంద్యాల :
శ్రీశైలం జలాశయంకు వరద పోటు పెరిగింది. ఎగువ నుంచి భారీగా వరద జలాలు వస్తున్నాయి. దాంతో డ్యాం అధికారులు అప్రమత్తమై సోమవారం నాలుగు గంటలకు 3 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ముందుగా ఈనెల 30వ తేదీన మంత్రి రామానాయుడు గేట్లు ఎత్తే కార్యక్రమం ఉన్నప్పటికీ శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటు పెరగడంతో నిర్ణయించిన గడువుకు ఒకరోజు ముందే గేట్లు ఎత్తారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 215 టీఎంసీలకు గాను ప్రస్తుతం 180 టీఎంసీల నీరు ఉంది. ఎగువ నుంచి 4.70 లక్షల క్యూసెక్కులు భారీగా వరద నీరు వస్తుండడంతో పది అడుగుల మేర నాలుగు గేట్లను ఎత్తి అధికారులు విడుదల చేశారు. నీటి ఉధృతి బట్టి మరికొన్ని గేట్లు కూడా ఎత్తే అవకాశం ఉంది.
గేట్ల ద్వారా 80 వేల క్యూసెక్కుల నీటి విడుదల
శ్రీశైలం 3 గేట్లు ఎత్తి 80 వేల క్యూసెక్కులను నాగార్జునసాగర్ కు విడుదల చేశారు. దాంతోపాటు విద్యుత్ ఉత్పత్తి ద్వారా అదనంగా నీటిని దిగువకు విడుదల చేశారువ దాంతో సుమారుగా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఒక లక్ష క్యూసెక్కుల నీరు దిగువన నాగార్జునసాగర్ కు విడుదలైంది.
12 రోజుల్లోనే నిండిన జలాశయం :
శ్రీశైలం జలాశయం కేవలం 12 రోజుల్లోనే నిండుకుండలా మారింది. ఈనెల 17వ తేదీ నుంచి శ్రీశైలం కు వరద నీరు రావడం ప్రారంభం కాగా కేవలం 12 రోజుల్లోనే జలాశయం పూర్తిస్థాయిలో నిండింది. ఇంకా భారీ వరద ఎగువ నుంచి రావడం వల్ల దిగువకు నీటిని విడుదల చేశారు.
ఇవి కూడా చదవండి :
BIG BREAKING : శ్రీశైలంకు గంట గంటకు పెరుగుతున్న వరద.. ఈరోజే ఎత్తనున్న 4 గేట్లు..!
క్యూసెక్కులు అంటే ఏమిటి.. నీటి ప్రవాహాన్ని అలా ఎందుకు కొలుస్తారు..!
రైతులకు రూ. 5 లక్షల పథకం.. అర్హతలు ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి, ఆగస్టు 5 చివరి తేదీ..!









