Viral : ఉపాధ్యాయ దినోత్సవం రోజు టీచరమ్మ డ్యాన్స్.. నేటిజెన్ల కామెంట్స్ చూస్తే.. (వీడియో)
Viral : ఉపాధ్యాయ దినోత్సవం రోజు టీచరమ్మ డ్యాన్స్.. నేటిజెన్ల కామెంట్స్ చూస్తే.. (వీడియో)
మన సాక్షి, వెబ్ డెస్క్ :
ఉపాధ్యాయుల దినోత్సవం వచ్చిందంటే పాఠశాలల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. విద్యార్థులు.. ఉపాధ్యాయులను పూజించడం, వారిని సన్మానించడం, గౌరవంగా నిర్వహించే కార్యక్రమాలు ఉంటాయి. కానీ కొన్ని పాఠశాలల్లో అసభ్యకరంగా టీచర్లచే డ్యాన్సులు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
మహిళా టీచర్లతో ఉపాధ్యాయులు, విద్యార్థుల ముందే డ్యాన్సులు వేయించడంతో ఉపాధ్యాయుల గౌరవం పోవడంతో పాటు పాఠశాల స్థాయి కూడా దిగజారే పరిస్థితి వస్తుంది. ఇలాంటి సంఘటనలు అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి.
ఇక ఆ పాఠశాలలో కూడా అలాంటి కార్యక్రమమే నిర్వహించారు. విద్యార్థులు తోటి ఉపాధ్యాయుల ముందే టీచర్ అమ్మ హాట్ డాన్స్ కార్యక్రమం నిర్వహించింది. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో నేటిజెన్లు తిట్టిపోస్తున్నారు.
టీచరమ్మ నల్ల చీర కట్టుకొని భోజన పురి పాటకు హాట్ డ్యాన్స్ చేసింది. ఈ కార్యక్రమం ఉపాధ్యాయ దినోత్సవం రోజు నిర్వహించినట్లుగా పక్కన సర్వేపల్లి రాధాకృష్ణ ఫోటో చూస్తుంటే అర్థమవుతుంది. సోషల్ మీడియాలో ఈ వీడియో పోస్ట్ పై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.
సిగ్గుమాలిన టీచర్ అని ఒకరు.. మహిళ ఉపాధ్యాయురాలు విద్యార్థుల ముందే ఇలా పాటలకు డాన్స్ చేయడం ఏంటని మండిపడుతున్నారు. మరి కొంతమంది ఇలాంటి స్కూళ్లు ఉంటే విలువలు ఎక్కడ నుంచి వస్తాయంటూ కామెంట్ చేస్తున్నారు.
कुछ अलौकिक और दिव्य चीजें इंसान को मरने के बाद ही प्राप्त होती हैं। अब भारत रत्न सर्वपल्ली राधाकृष्णन जी को ही देख लीजिये। ऐसा सांस्कृतिक वातावरण में सम्पन्न होता शिक्षक दिवस उन्होंने जीते जी कभी नही देखा होगा। मने कि पठन-पाठन का इतना उच्चस्तरीय वातावरण किसी को क्या ही नसीब होगा।… pic.twitter.com/adxBwaqJRL
— Atul Kumar Rai (@AuthorAtul) September 7, 2024
LATEST UPDATE :
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం దరఖాస్తు స్వీకరణ.. 17 వరకు గడువు పెంపు..!
Suryapet : చిట్టి చేతులు.. భారీ సహాయం..!
Good News : మహిళలకు భారీ శుభవార్త.. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం..!
High Court : హైకోర్టు కీలక ఆదేశం.. తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయా..!









