తెలంగాణBreaking News

తెలంగాణలో మరోసారి భారీ వర్ష సూచన.. ఆయా జిల్లాల్లో అలర్ట్..!

తెలంగాణలో మరోసారి భారీ వర్ష సూచన.. ఆయా జిల్లాల్లో అలర్ట్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో మరోసారి భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొన్నది. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న రాష్ట్రంలో మరోసారి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. వర్షాలు వరదలు పోయాయనుకుంటున్న ప్రజలకు అధికారులు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు.

ఆయా జిల్లాలకు వర్ష సూచన ఉన్నట్లు అధికారు లు వెల్లడించారు. ఖమ్మం, కొత్తగూడెం, వరంగల్, ములుగు, మహబూబాబాద్ జిల్లాలలో ప్రస్తుతం వర్షాలు భారీగా దంచి కొడుతున్నాయి.

కానీ రాబోయే రెండు రోజుల్లో నిజామాబాద్, మంచిర్యాల, జగిత్యాల, హనుమకొండ, జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాలలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవలనే ఖమ్మం తోపాటు నల్లగొండ, వరంగల్ జిల్లాలో కూడా వరదలు బీభత్సంగా వచ్చాయి. ఎడతెరిపిలేని వర్షాల వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొన్నారు.

LATEST UPDATE : 

ఖైరతాబాద్ వినాయకుడి వద్ద సీఎం రేవంత్ దంపతులు తొలి పూజ.. రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్..!

మిర్యాలగూడ : పిసిసి చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ నియామకం పట్ల హర్షం..!

బ్లడ్ మూన్.. ఈనెల 28న భూమి అంతం.. వణుకు పుట్టిస్తున్న సిద్ధాంతకర్తల సాక్షాలు..?

Rythu : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. రైతు బీమా కోసం మొబైల్ యాప్..!

మరిన్ని వార్తలు