Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Nalgonda : ఒక్క ఫోన్ కాల్ చాలు.. కోమటిరెడ్డి మార్క్..!

Nalgonda : ఒక్క ఫోన్ కాల్ చాలు.. కోమటిరెడ్డి మార్క్..!

నల్లగొండ, మనసాక్షి :

సమస్యల కోసం ప్రజలు ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరిగే రోజులు. అలాంటి ఒక్క ఫోన్ కాల్ తోటే ఆ మంత్రి సమస్యలు పరిష్కరించారు. వివరాల్లోకి వెళితే.. వివిధ సమస్యలను పరిష్కరించాలని మంత్రి కోమటిరెడ్డి కలిసిన పలువురు సమస్యలను ఒక్క ఫోన్ తోనే ఆయన పరిష్కరించారు.

రాష్ట్ర రోడ్లు,భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డికి వినతులు వెల్లువెత్తాయి. తన క్యాంపు కార్యాలయ సమీపంలో గల పార్క్ లో వివిధ సమస్యలకు సంబంధించి పట్టణ ప్రజలతో పాటు నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు మంత్రికి కలిసి వినతి పత్రాలు సమర్పించారు.

పలువురు సమస్యలను విన్న మంత్రి ఫోన్లో పలువురు అధికారులతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించారు. మరి కొన్ని సమస్యలను అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా పలువురి పేద విద్యార్థుల చదువు కోసం మంత్రి ఆర్థిక సహాయం అందించారు..ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, జడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య తదితరులు ఉన్నారు.

ALSO READ : 

POSTAL: పోస్టల్ శాఖలో 50వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్, రాత పరీక్ష లేకుండా ఎంపిక..!

Free Coaching : సివిల్స్ లాంగ్ టర్మ్ ఉచిత శిక్షణ.. డిగ్రీ పాసైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ వారి నుంచి దరఖాస్తులకు ఆహ్వానం..!

 

మరిన్ని వార్తలు