Paddy : 5 కేజీల ధాన్యం తరుగు ఇవ్వకుంటే … లారీని తిరిగి పంపిన మిల్లు యజమాని

Paddy : 5 కేజీల ధాన్యం తరుగు ఇవ్వకుంటే … లారీని తిరిగి పంపిన మిల్లు యజమాని

మణుగూరు. మన సాక్షి

టిఆర్ఎస్ పాలనలో రైతుకు కన్నీటి ఘోషె మిగులుతుంది. ఒకపక్క వరుణుడు కరుణించక సగం ధాన్యాన్ని నష్టపోయిన రైతు….మరో పక్క మిల్లు యజమాని 5 కేజీల తరువు ఇస్తేనే కొంటానని హుకుం జారీ చేయడంతో రైతు కన్నీటి పర్వంతమయ్యాడు.

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని రామనుజవరం రైతులు సోసైటి ద్వారా ధాన్యం కొనుగోలు చేసి లారీ లోడ్ చేసి మిల్లుకు సొసైటీ ద్వారా పంపించడం జరిగింది. మిల్లుకు పోయిన ధాన్యాన్ని మిల్లు యజమాని ఒక క్వింట ధాన్యం బస్తాకు 5 కేజీల తరుగు తీస్తే తప్ప మేము ధాన్యం తీసుకుంటామని, లేకపోతే తీసుకోమని లారీలోడ్ చేసి పంపిన లారీ AP 29T 6369 నెంబర్ గల లారీ తిరిగి ధాన్యం కొనుగోలు సెంటర్ తిరిగి పంపించారు.

 

రైతుల్ని మిల్లు యజమాని వేధిస్తున్నారని రైతులు చెబుతున్నారు.. అధికారులుకు చెప్పిన పట్టించుకునే నాథుడే లేడని వాపోయారు..ఒక వైపు అకాల వర్షానికి పంట నష్టపోయి రైతులు బాధపడుతుంటే…

 

మరోవైపు మిల్లర్ యాజమాన్యం తరుగుదల పేరుతో రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారని రైతులు డేగల కృష్ణ రావు, పోతనబోయన సరిత, దేశభోయన సాంబశివరావు, తోటకూరి పద్మ, బోల్లమ్మ సైదలు, రైతులు తోటకూర కోటయ్య, దాంపత్యం, వెంకటనారాయణ,పోతనబోయన వెంకటనారాయణ , గోవర్థన్, మొదలగు రైతులు సామాజిక కార్యకర్త లాయర్ కర్నే రవితో ఆశ్రయించారు.

 

సాధ్యమైనంతవరకు అధికారులతో మాట్లాడి తమకు న్యాయం చేస్తామని సామాజిక కార్యకర్త కర్నే రవి హామీ ఇచ్చారు.