ప్రపంచంBreaking News
Pahagam : రెచ్చగొడుతున్న పాక్..!

Pahagam : రెచ్చగొడుతున్న పాక్..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
జమ్ము కాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో భారత్ తీవ్రంగా స్పందించింది. అందులో భాగంగానే పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది. సింధు జలాలపై చేసుకున్న ఒప్పందం కూడా భారత్ రద్దు చేసింది. అయితే పాకిస్తాన్ కూడా అదే స్థాయిలో స్పందించింది. పాకిస్తాన్ కూడా సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
అయితే ఈ నిర్ణయం తీసుకున్నాక శుక్రవారం తెల్లవారుజామున పాకిస్తాన్ నియంత్రణ రేఖ వద్ద భారత్ సైన్యాన్ని రెచ్చగొట్టే చర్యలకు ఉపక్రమించింది. భారత్ భూభాగం పైకి కాల్పులకు తెగబడింది. దాంతో భారత్ సైన్యం అదే స్థాయిలో స్పందించింది. పాక్ కు గట్టిగా బదులు చెప్పింది. అయితే ఈ కాల్పుల్లో భారత సైనికులకు ఎటువంటి గాయాలు కాలేదు సైనిక అధికారులు పేర్కొంటున్నారు.
MOST READ :
-
అఘోరి ఆడా.. మగా.. తేల్చి చెప్పిన వైద్యులు.. చంచల్ గూడ జైలుకు తరలింపు..!
-
SBI Life: సత్తా చాటిన ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్.. రూ.35 వేల కోట్లకుపైగా బిజినెస్..!
-
Constables : ఏడుగురు కానిస్టేబుల్ లకు పదోన్నతి..!
-
SBI: FY 25 ఫలితాలు ప్రకటించిన ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్.. 112% పెరిగిన లాభం..!
-
Rythu Bharosa : రైతు భరోసా అందని రైతులకు స్పష్టత.. లేటెస్ట్ అప్డేట్..!









