Breaking Newsతెలంగాణరాజకీయం

ఆగస్టులోనే పంచాయతీ ఎన్నికలు..?

ఆగస్టులోనే పంచాయతీ ఎన్నికలు..?

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఆగస్టు మాసంలోనే గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంసిద్ధమైనట్లు తెలుస్తోంది. పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి గత ప్రభుత్వo 10 సంవత్సరాల పాటు ఒకే రిజర్వేషన్ ఉండే విధంగా 2019 లో చట్టం చేసింది. దాంతో ఈ పర్యాయం కూడా అదే రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.

ఆగస్టు 15వ తేదీ వరకు రైతుల రుణమాఫీ ప్రక్రియ కూడా పూర్తికానున్నది. దాంతో రైతుల్లో ఆనందం ఉండే అవకాశాలు ఉన్నాయి. కాగా పంచాయతీ ఎన్నికలకు ఆగస్టులోనే వెళ్తే కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూరే అంశాలు ఉన్నట్లుగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో గ్రామపంచాయతీ ఎన్నికలు ఆగస్టులోనే నిర్వహించేలా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ త్వరలో వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ALSO READ : 

Miryalaguda : ట్రాక్టర్ తో దున్ని నాట్లు వేసి.. పొలంలో రైతు కూలీలతో కలిసి ఆ ఎమ్మెల్యే రుణమాఫీ సంబరం..!

Srishailam : శ్రీశైలంలో 859 అడుగులకు చేరిన నీటిమట్టం.. కొనసాగుతున్న వరద.. LATEST UPDATE

రాష్ట్ర సరిహద్దుల్లో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి.. జిల్లా ఎస్పీ ఆదేశం

మరిన్ని వార్తలు