తెలంగాణBreaking Newsనారాయణపేట జిల్లావిద్య

District collector : పంతులమ్మగా జిల్లా కలెక్టర్..!

District collector : పంతులమ్మగా జిల్లా కలెక్టర్..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. గురువారం నారాయణపేట మండలం చిన్నజట్రం ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో ఉపాధ్యాయుల విద్యార్థుల హాజరు రిజిస్టర్ తనిఖీ చేసి తదితర అంశాలపై అడిగి తెలుసుకున్నారు.

అనంతరం డిఎంహెచ్వో కార్యాలయాన్ని తనిఖీ చేసి హాజరు రిజిస్టర్ పరిశీలించారు. జిల్లాలో వైద్య సేవలు నిరుపేదలకు అందేలా ప్రతి ఉద్యోగి కృషి చేయాలన్నారు.ఈ సందర్భంగా డిఎంహెచ్వో జిల్లాలో సిబ్బంది వివరాలు కలెక్టర్ కు తెలిపారు.

అనంతరం జిల్లా కేంద్రం లోని 6వ వార్డ్ లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల బేస్ మెంట్ లెవెల్ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. నాణ్యతగా ఇంటి నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ భోగేశ్వర్ లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Gold Price : భారీగా రూ.13,600 తగ్గిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ధర ఎంతంటే..!

  2. Sub Collector : నారాయణఖేడ్‌ సబ్‌ కలెక్టర్‌ గా ఉమా హారతి.. ఎవరో తెలుసా..!

  3. Oil Farm : రైతులకు అదిరిపోయే శుభవార్త.. ఎకరానికి రూ.50 వేల రాయితీ.. దరఖాస్తుల ఆహ్వానం..!

  4. TG News : యాదగిరిగుట్ట హుండీలో 12 దేశాల కరెన్సీలు.. ఏ దేశాలంటే..!

  5. Gold Medal : గ్రామీణ ప్రాంత నిరుపేద విద్యార్థి.. ప్రతిభకు గోల్డ్ మెడల్ దక్కింది..!

మరిన్ని వార్తలు