Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండపండుగలు

Nalgonda : నల్గొండలో వైభవోపేతంగా శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం..!

నల్గొండలోని రామగిరి శ్రీ సీతా రామచంద్రస్వామి దేవాలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి వచ్చే సంవత్సరం శ్రీరామనవమి నాటికి మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.

Nalgonda : నల్గొండలో వైభవోపేతంగా శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం..!

సీతారామ కళ్యాణం లో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.

నల్లగొండ, మనసాక్షి :

నల్గొండలోని రామగిరి శ్రీ సీతా రామచంద్రస్వామి దేవాలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి వచ్చే సంవత్సరం శ్రీరామనవమి నాటికి మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. శ్రీరామనవమిని పురస్కరించుకొని శుక్రవారం నల్గొండ పట్టణంలోని రామగిరి దేవాలయంలో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణోత్సవంలో మంత్రి పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ రామగిరి దేవాలయానికి ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు తరలివస్తారని చెప్పారు.దేవాలయ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని, వైకుంఠ దర్శనం, ఉత్తర ద్వార దర్శనం వంటి సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. దర్శన మార్గాల విస్తరణ కోసం అవసరమైన స్థల సేకరణకై ఇప్పటికే చర్చలు జరుపుతున్నామని, నెల రోజుల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని చెప్పారు.

రామగిరి రామాలయానికి గొప్ప చరిత్ర ఉందని గుర్తుచేస్తూ, భక్తులకు మరింత సౌకర్యాలు కల్పించేలా అభివృద్ధి చేస్తామని తెలిపారు. అలాగే, దేవాలయ భూములకు ఇబ్బంది కాకుండా నేషనల్ హైవే మార్గాన్ని బైపాస్ ద్వారా మళ్లించామని పేర్కొన్నారు.నల్గొండ పట్టణ ప్రజలు శ్రీరాముని కృపతో సుఖ : సంతోషాలతో ఉండాలని మంత్రి ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి సహకారంతో రామగిరి రామాలయాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఉత్తర ద్వార దర్శనానికి కృషి చేస్తానని చెప్పారు.స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై .అశోక్ రెడ్డి, జిల్లా పరిషత్ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి , మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి , మాజీ జెడ్పిటిసి పాశం రామ్ రెడ్డి, కార్పొరేటర్లు, భక్తులు ,ప్రజలు పాల్గొన్నారు.

ALSO READ :

కేంద్రం అనూహ్య నిర్ణయం.. పెట్రో ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ పన్ను తగ్గింపు..!

LPG : గ్యాస్ పై కేంద్రం గుడ్ న్యూస్.. రాష్ట్రాలకు లేఖలు..!

మరిన్ని వార్తలు