Pavan Kalyan : రాబోయే ఎన్నికల్లో పొత్తు పై పవన్ కళ్యాణ్ క్లారిటీ.. సంచలనం నిర్ణయం..!
Pavan Kalyan : రాబోయే ఎన్నికల్లో పొత్తు పై పవన్ కళ్యాణ్ క్లారిటీ.. సంచలనం నిర్ణయం..!
టిడిపి , జనసేన కలిసే పోటీ చేస్తాయని స్పష్టం
నారా చంద్రబాబు నాయుడుతో రాజమండ్రి సెంట్రల్ జైల్లో మూలాఖత్ అయిన అనంతరం ప్రకటించిన పవన్ కళ్యాణ్
రాజమండ్రి , మనసాక్షి :
రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీల పొత్తు విషయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో జనసేన , తెలుగుదేశం పార్టీ కలిసే పోటీ చేస్తుందని ఆయన ప్రకటించారు.
గురువారం రాజమండ్రి లోని సెంట్రల్ జైల్లో ఉన్న టిడిపి జాతీయ అధ్యక్షులు , మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆ పార్టీ నేతలు లోకేష్, నందమూరి బాలకృష్ణ తో కలిసి మూలకత్ అయ్యారు. 45 నిమిషాలకు పైగా చంద్రబాబుతో ములకత్ అయ్యారు .
ALSO READ : TS RTC : ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ చెల్లింపులు.. అందుబాటులోకి ఐ – టిమ్స్ యంత్రాలు..!
అనంతరం సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చి మీడియాతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు ఒక రాజకీయ వేత్త అని, ముఖ్యమంత్రి జగన్ ఆర్థిక నేరస్తుడని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో టిడిపి తో జనసేన కలిసి పోటీ చేస్తాయని , ఆంధ్ర ప్రదేశ్ ప్రజల మంచి కోసం కలిసి పోటీ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో అరాచక పాలన కొనసాగుతుందని, అందులో భాగంగానే చంద్రబాబు నాయుడును అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. సైబరాబాద్ లాంటి ప్రత్యేకమైన సిటీని ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడును జైల్లో పెట్టడం సరైనది కాదన్నారు. చంద్రబాబుపై ఆరోపణలు చేసిన వ్యక్తి ఏమైనా మహానుభావుడ అని అన్నారు.
ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన స్కాం అని అందులో బాధ్యులను శిక్షించాలి తప్ప ఆయనకు ఎలాంటి సంబంధం లేని విషయమని పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కీం అనేది గుజరాత్ లో ప్రారంభమైనట్లు ఆయన పేర్కొన్నారు.
ALSO READ : WhatsApp : వాట్సాప్ లో డిలీట్ అయినవి తిరిగి పొందవచ్చు.. అందుబాటులో అదిరిపోయే ఫీచర్స్..!
రాబోయే రోజుల్లో జనసేన , తెలుగుదేశం పార్టీ కలిసే పోరాటం చేస్తాయని కలిసే కార్యక్రమాలు నిర్వహిస్తాయని ప్రజల అభిప్రాయంతో పాటు పార్టీ నేతల అభిప్రాయం కూడా తెలుసుకుంటాయన్నారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా 2000 మంది పోలీసులను పెట్టి అరెస్టులు చేస్తున్నారన్నారు.
చంద్రబాబు నాయుడు అరెస్టు విషయంపై రాష్ట్ర గవర్నర్ కు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్తామన్నారు. వైసిపి అరాచక పాలన అడ్డుకోవడానికి సమిష్టిగా పోటీ చేయాల్సిన అవసరం వచ్చిందన్నారు. రాజకీయ ప్రతీకారంతో చంద్రబాబు నాయుడు అరెస్టు చేసినట్లు తెలిపారు.
ALSO READ : Mobile Net : మీ మొబైల్ లో నెట్ స్లో అయ్యిందా.. ఈ మార్పులు చేయండి.. రాకెట్ వేగంతో నెట్ స్పీడ్..!









