యాదాద్రి భువనగిరి జిల్లా : పిడుగుపాటుకు 34 మేకల మృతి

పిడుగుపాటుకు 34 మేకల మృతి

గుండాల, మనసాక్షి:

యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం తుర్కల శాపురం గ్రామంలో శనివారం మధ్యాహ్నం కురిసిన వర్షానికి పిడుగు పడి ఉప్పుల సత్తయ్య,
ఉప్పుల లింగమల్లు కు చెందిన 34 మేకలు పిడుగు పడి మరణించాయి . ఒక్కొక్క మేక ఖరీదు సుమారుగా 20వేల రూపాయలకు పైగానే ఉంటుందని పేర్కొన్నారు.

 

మేకలన్నీ ఒకేసారి, ఒకే దగ్గర మృతి చెందడంతో ఆ రైతులు బోరున విలపించారు. రైతుల కన్నీటిని చూసి గ్రామస్తులు సైతం కన్నీరు పెట్టుకున్నారు. వారిని ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు రు పేర్కొన్నారు.