Khammam : పులిగుండాల ఎకో టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు..!
Khammam : పులిగుండాల ఎకో టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు..!
ఖమ్మం బ్యూరో, మన సాక్షి:
ఖమ్మం జిల్లా లో పులిగుండాల చెరువు నందు బోటింగ్ పక్షులను వీక్షించుట ట్రెక్కింగ్ రాత్రి సమయములలో నక్షత్రముల వీక్షణ కొరకు అటవీ ప్రాంతంలో క్యాంపులు ఏర్పాటు చేయనున్నట్లు తద్వారా అడవిలో సఫారీ చేయుట వృక్షజాలం జంతుజాలం గురించి అధ్యయనం చేయుటకు అవకాశాలు మెండుగా ఉన్నాయని జిల్లా అటవీ శాఖ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్ అన్నారు.
శనివారం జిల్లా అటవీశాఖ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఖమ్మం జిల్లా పర్యటక రంగాన్ని అభివృద్ధి పరిచేందుకు జిల్లాలోని సంబంధిత శాఖలతో కలిసి ఒక పర్యాటక కమిటీని ఏర్పాటు చేసి త్వరలో మీటింగ్ నిర్వహించి పులిగుండాల ఎకో టూరిజం ప్రాంతాన్ని స్థిరమైన పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకునేందుకు కృషి చేయడం జరుగుతుందని దీని ద్వారా ఖమ్మం జిల్లా చుట్టు ప్రక్కల ఉన్న ప్రదేశాల నుండి పర్యాటకులు అత్యధికంగా పెరగడమే కాకుండా అక్కడ ఉన్న స్థానికులకు ఉపాధి ఆదాయ వనరులు పెరుగుతాయని తద్వారా అటవీ మరియు వన్యప్రాణ సంరక్షణపై అవగాహన పెరిగి అటవీ రక్షణ పటిష్టంగా అమలవుతుందని అన్నారు.
ఎకో టూరిజం అభివృద్ధి చేసేందుకు జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ జిల్లా అదనపు కలెక్టర్ శ్రీజ,దీక్ష రైనా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వి. మంజుల ఏ సి ఎఫ్ సత్తుపల్లి ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ జి ఉమా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తల్లాడ అటవీ రేంజ్ అధికారులు ఇటీవల పులి గుండాల ఎకో టూరిజం ప్రాంతాన్ని సందర్శించి అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
MOST READ :
-
Miryalaguda : అభ్యాస్ టెక్నో హైస్కూల్లో ఘనంగా స్వపరిపాలనా దినోత్సవం..!
-
Budget: బడ్జెట్ ముందు హల్వా వేడుక.. ఎందుకు నిర్వహిస్తారో తెలుసా?
-
Shankarpally : శంకర్పల్లి ఎస్సీ బాలుర వసతి గృహంలో కనీస వసతులు కరువు..!
-
Phone Pe : ఫోన్ పే, గూగుల్ పే యూజర్స్ కు భారీ షాక్.. ఫిబ్రవరి నుంచి కొత్త రూల్స్.. మీకు తెలుసా..!









