పేకాట స్థావరం పై పోలీసుల దాడి..!
పేకాట స్థావరం పై పోలీసుల దాడి..!
శంకర్‌పల్లి, మన సాక్షి :
పేకాట ఆడుతున్న స్థావరంపై పోలీసులు దాడి చేసిన ఘటన మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం మిర్జాగూడ అనుబంధ గ్రామమైన ఇంద్రారెడ్డినగర్ లో ఓ రేకుల ఇంటిలో 9 మంది వ్యక్తులు పేకాట ఆడుతుండగా స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన పోలీసులు స్థావరంపై దాడి చేసి వారి వద్ద రూ. 88,100.. 9 సెల్ ఫోన్లు, 104 పేకాట కార్డ్ లు స్వాధీనపరుచుకున్నారు. ఈ మేరకు పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
MOST READ :
KTR : మన కేటీఆర్ ఇలా అయ్యాడా.. ఏంటో ఆ కథ తెలుసుకోండి.. నెట్టింట్లో వైరల్..!
తెలంగాణ : రైతుల రుణమాఫీ పై గవర్నర్ కీలక ప్రకటన..!
తెలంగాణ : రేషన్ కార్డుదారులు అలా చేయకుంటే కట్.. గడువు మరో నెల పెంపు..!
Jobs : పదవ తరగతి అర్హతతో రైల్వే శాఖలో ఉద్యోగాలు.. జీతం రూ. 40 వేలు..!









